ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు హీరో అల్లు శిరీష్ ఎప్పుడో ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు. ఉర్వశివో రాక్షసీవో తర్వాత మళ్ళీ బడ్డీ చిత్రంతో చాలా రోజుల తర్వాత ప్రేక్షకులని పలకరించేందుకు సిద్దమైనాడు. తాజాగా బడ్డీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్.
ఆ ఈవెంట్ లో అల్లు అయాన్ గురించి మీడియా వారు అడగగానే.. ఓ మావాడికి సోషల్ మీడియా ఇంత ఫాలోయింగ్ ఉందా, వాడి హవానే నడుస్తుంది అని ఆశ్చర్యపోయిన శిరీష్ ని బడ్డీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ని గెస్ట్ గా తీసుకొస్తారా అని మీడియా ప్రశ్నించింది. దానికి అల్లు శిరీష్ కాస్త తడబడుతూ.. అప్పుడు చూద్దామన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చి సైలెంట్ అయ్యాడు. అంతేకాదు పుష్పలోని సూసేటి సాంగ్ గురించి అడగ్గానే నిర్మాత వంక చూస్తూ ఇపుడు మన సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుందామంటూ శిరీష్ తప్పించుకున్నాడు.
మరి తన సినిమా ప్రమోషన్స్ కి అన్న అల్లు అర్జున్ సాయం తీసుకోడా అల్లు శిరీష్. అంటే అల్లు ఫ్యామిలిలో అందరూ అనుకుంటున్నట్టుగా లుకలుకలు ఉన్నాయా అని నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. గతంలో అల్లు శిరీష్ అల్లు ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే కదా.! ఇప్పుడు బడ్డీ ఈవెంట్ కి అన్న వస్తాడా అంటే శిరీష్ ఎందుకు తడబడుతున్నాడో అంటూ మరిన్ని అనుమానాలను నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు.