పాపం జగన్ ఈరోజు ఏపీ స్పీకర్ అయ్యన పాత్రుడికి ప్రతి పక్ష హోదా కావాలని వేడుకుంటూ లేఖ రాసి అందరికి అడ్డంగా దొరికిపోయాడు. అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లో కానీ పది శాతం సీట్లు వస్తేనే ప్రతి పక్ష హోదా దక్కుతుంది అని రాజ్యంగంలో రాయలేదు, మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత నాతొ ప్రమాణ స్వీకారం చేయించారు.. ఇది పద్ధతేనా అంటూ జగన్ రాసిన లేఖ ఇప్పుడు కామెడీ అయ్యిపోయింది.
ఎందుకంటే 2019 ఎలక్షన్ లో 151 సీట్ల తో గెలిచి అసెంబ్లీలో సీఎం హోదా లో ఉండి ప్రతి పక్ష నాయకులని కించపరిచినట్లుగా మాట్లాడమే కాదు.. మీకొచ్చిన 23 అసెంబ్లీ సీట్లలో నుంచి ఓ ఐదు నేను లాగేస్తే.. మీకు 18 లేదంటే 17 మిగులుతాయి. నేను ఓకె అంటే వైసీపీ లోకి రావడానికి టీడీపీ ఎమ్యెల్యేలు ఎదురు చూస్తున్నారు.. అప్పుడు మీకు ప్రతి పక్ష హోదా కూడా లేకుండా పోతుంది.. అంటూ జగన్ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ వీడియో ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
అప్పుడు సీఎం గా ఉన్న మీరు ఏం మట్లాడారు అంటూ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు పై, ప్రతి పక్షం పై చేసిన వ్యాఖ్యల వీడియో ని టీడీపీ కార్యకర్తలు బయటికి తీసి మరీ.. అప్పుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తా అన్నావ్.. నువ్విప్పుడు ప్రతిపక్షంలో లేకుండా ప్రజలే చేసారు, అప్పుడు ప్రతి పక్షం కూడా లాగేసుకుంటా అని వాగిన నువ్వు ఇప్పుడు ప్రతి పక్ష హోదా గురించి సిగ్గులేకుండా ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నావ్ అంటూ జగన్ ని ట్రోల్ చేస్తున్నారు.
పాపం జగన్ ఈ ఒంకతో అసెంబ్లీకి ఎగ్గొడదామని.. ఏదో ప్లాన్ చేద్దామని మరేదో చేసి ఇలా దొరికిపోయాడేమిటో అంటూ టీడీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు.