Advertisementt

హైదరాబాద్ లో దిగిన ఎన్టీఆర్

Mon 24th Jun 2024 12:17 PM
jr ntr  హైదరాబాద్ లో దిగిన ఎన్టీఆర్
Jr NTR lands in Hyd హైదరాబాద్ లో దిగిన ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి గత వారం థాయిలాండ్ వెళ్లారు. అక్కడ దేవర సాంగ్ షూట్ తో పాటుగా ఫ్యామిలీతో కలిసి సమయాన్ని గడిపేందుకు భార్య ప్రణతి, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లని వెంటబెట్టుకుని ఎన్టీఆర్ థాయిలాండ్ వెళ్లారు. ఇక అక్కడ దేవర సాంగ్ షూట్ లో పాల్గొన్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ తో కలిసి ఎన్టీఆర్ కాలు కదిపారు. ఆయనతో వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఎన్టీఆర్ తో వర్క్ చెయ్యడం పై చాలా ఎగ్జైట్ అయ్యారు. 

ఇక దేవర కి సంబంధించి ఓ పాటని థాయిలాండ్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కొరటాల చిత్రికరించారు. ఇక అక్కడ సాంగ్ షూట్ పూర్తి కావడంతో ఎన్టీఆర్ ఈ రోజు ఉదయమే హైదరాబాద్ కి తిరిగి వచ్చేసారు. ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో నడిచి వస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇక కొరటాల-ఎన్టీఆర్ దేవర చిత్రం సెప్టెంబర్ 27 కి రాబోతుంది ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో పోషిస్తుండగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. 

Jr NTR lands in Hyd:

Jr NTR returns from Thailand

Tags:   JR NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ