సూపర్ స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కలయికలో మొదలు కాబోయే మూవీ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ కాంబో ని ఒకే ఫ్రెమ్ లో చూస్తామా.. వారిద్దరూ కలిసి కనిపించే క్షణం కోసం అభిమానులే కాదు.. పాన్ ఇండియా ప్రేక్షకుల సైతం కాచుకుని కూర్చున్నారు. మరి నిర్మాత ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారు.
రాజమౌళి కూడా మహేష్ మూవీ స్క్రిప్ట్ లాక్ చెసే పనిలో ఉన్నారు. తాజాగా ఈ మూవీకి మ్యూజిక్ అందించబోయే రాజమౌళి ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. రాజమౌళి-మహేష్ కాంబో మూవీపై చేసిన హాట్ కామెంట్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి. నేను ఇప్పటివరకు మహేష్-రాజమౌళి సినిమా సంగీత పనులు ప్రారంభించలేదు. ఎందుకంటే ఈ వారమే స్టోరీ లాక్ అయింది.
ప్రస్తుతం కొన్ని టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయి. నేను జులై లేదా ఆగస్టులో మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేస్తా అంటూ రాజమౌళి-మహేష్ మూవీ పై కీరవాణి చేసిన కామెంట్స్ ని మహేష్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. మహేష్ బర్త్ డే స్పెషల్ గా ఏమైనా రాజమౌళి ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారేమో అనే ఆశతో మహేష్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మరి రాజమౌళి ఆలోచన ఎలా ఉందొ తెలియాల్సి ఉంది.