గత ఆరు నెలలల్లో భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ఫిలిమ్స్ ఏవి బాక్సాఫీసు దగ్గర సందడి చెయ్యలేదు. సంక్రాంతి సీజన్ ముగిసాక మధ్యలో ఐపీఎల్, ఎన్నికలంటూ ఐదు నెలల కాలం కరిగిపోయింది. ఇక జూన్ 27 న ఓ భారీ పాన్ ఇండియా ఫిలిం తో బాక్సాఫీసులో కదలిక రాబోతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD చిత్రం భారీ అంచనాల నడుమ భారీగా బాక్సాఫీసు వద్దకు చేరబోతోంది.
అయితే థియేటర్స్ లో విడుదల కాబోయే కల్కి టికెట్ రేట్స్ పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కన్నా తెలంగాణాలో కల్కి టికెట్ రేట్స్ పెంచుకునేందుకు తెలంగాణా ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. అంతేకాదు అదనపు షో లకి కూడా అనుమతులు వచ్చేసాయి.
ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజులపాటు టికెట్ ధరల పెంపునకు అనుమతి
టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతీ మూవీస్ దరఖాస్తు
కల్కీ చిత్ర టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు అనుమతి
సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్ ల్లో రూ.100 పెంపునకు అనుమతి
27న ఉదయం 5:30 షోకు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం
వారం రోజులపాటు ఐదు షోకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసారు.