షూటింగ్ కి బ్రేకిచ్చే ముందు సమంత తెలుగు లో ఖుషి చిత్రాన్ని, హిందీలో హాలీవుడ్ సిటాడెల్ రీమేక్ హనీ బన్నీ వెబ్ సిరీస్ షూటింగ్స్ ని ఫినిష్ చేసిన సమంతా ఆ తర్వాత ఆరు నెలల పాటు సినిమా షూటింగ్స్ వైపు చూడలేదు. సమంత కొద్ధిరోజుల పాటు ఏ సినిమా సెట్స్ మీదకి వెళ్ళలేదు. అయితే సమంత-ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే కలిసి చేసిన సిటాడెల్ సీరీస్ మే నెల లో అమెజాన్ ప్రైమ్ లోనే స్ట్రీమింగ్ అన్నారు.
కానీ ఇప్పటివరకు సిటాడెల్ హనీ బన్నీ స్ట్రీమింగ్ పై అమెజాన్ ప్రైమ్ వారు ఎటువంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. అసలు సిటాడెల్ స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది క్లారిటీ రావడం లేదు. మరోపక్క రాజ్ అండ్ డీకే లు ఫ్యామిలీ మ్యాన్ 3 ని పట్టాలెక్కించారు. ఇంకోపక్క ఫార్జి వెబ్ సీరీస్ సీక్వెల్ రావాల్సి ఉంది.
మరి సిటాడెల్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా మేకర్స్ ఇంకా స్ట్రీమింగ్ కి తేకుండా వేచి ఉండడానికి కారణమేమిటో అనేది సమంత అభిమానులకి అర్ధం కావడం లేదు. ప్రస్తుతం సమంత సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో తన ఉనికిని చాటుకుంటుంది.