Advertisementt

హాట్ టాపిక్: కల్కి తారల పారితోషికాలు

Sat 22nd Jun 2024 03:03 PM
kalki  హాట్ టాపిక్: కల్కి తారల పారితోషికాలు
Hot Topic: Kalki Stars Remuneration హాట్ టాపిక్: కల్కి తారల పారితోషికాలు
Advertisement
Ads by CJ

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్, కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకొనె ల కలయికలో జూన్ 27 న రాబోతున్న కల్కి 2898 AD పై ట్రేడ్ లోనే కాదు పాన్ ఇండియా ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు కల్కి ని వీక్షించాలా అని కాపు కాచుకుని కూర్చున్నారు. స్తబ్దుగా ఉన్న బాక్సాఫీసుని తట్టి లేపే క్షణం ఆసన్నమైంది. 

ఇప్పటికే కల్కి 2898 AD నుంచి విడుదలైన రెండు ట్రైలర్స్ కూడా అంచనాలకు మించి ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్, కమల్, దీపికా పదుకొనె ల పారితోషికాలపై ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో హాట్ హాటా గా చక్కర్లు కొడుతోంది. 600 నుంచి 700కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కిన కల్కి లో పారితోషికాల కోసమే 250 కోట్లు ఖర్చయినట్టుగా తెలుస్తోంది. 

అందులో పాన్ ఇండియా స్టేటస్ ని మైంటైన్ చేస్తున్న ప్రభాస్ కి దాదాపుగా 150 కోట్ల పారితోషికాన్ని ఇచ్చారట వైజయంతి వాళ్ళు. మిగతా కీలక పాత్రాలు చేసిన కమల్ హాసన్, అమితాబ్, దీపికా లకి చెరో 20 కోట్లు పారితోషికాల కింద ఇవ్వగా.. ఇతర నటులకి, టెక్నీకల్ సిబ్బందికి కలిపి ఓ 60 కోట్ల వరకు ఖర్చయ్యింది అంటున్నారు. మరి 250కోట్లు పారితోషికాలకి తీసేస్తే.. మిగతా 450 కోట్లు సినిమా ని నిర్మించడానికి నాగ్ అశ్విన్ ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది.. 

విజువల్ వండర్ గా రాబోతున్న కల్కి 2898 AD కి పార్ట్ 2 కూడా ఉండబోతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. కానీ ఈవిషయంలో నాగ్ అశ్విన్ అండ్ టీమ్ సైలెన్స్ ని మైంటైన్ చేస్తుంది.

Hot Topic: Kalki Stars Remuneration:

Kalki Remunerations ₹250 Crores?

Tags:   KALKI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ