గుడివాడ మాజీ మంత్రి, ఎమ్యెల్యే కొడాలి నాని కి ఇంకా కొవ్వు తగ్గలేదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో బూతు మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని ని గుడివాడ ప్రజలు తరిమితరిమి కొట్టారు. ఈ ఎన్నికల్లో దారుణాతి దారుణంగా ఓడించారు. అయినప్పటికి కొడాలి నాని కి కాస్తైనా బుద్ధి రాలేదు అంటూ గుడివాడ ప్రజలే మాట్లాడుకోవడం నిజంగా వింతగానే ఉంది.
నిన్న గురువారం జగన్ మోహన్ రెడ్డితో సమావేశమైన తర్వాత బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ మరోసారి చంద్రబాబు పై రెచ్చిపోయి నాని వ్యాఖ్యలు చేసాడు. జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఫర్నిచర్ వాడుకున్నాడంటూ మాట్లాడుతున్నారు, దాని విలువ ఏంతొ చెప్పండి పడేస్తాం, లేదంటే వెనక్కి పంపిస్తాం, జగన్ ఎప్పుడు ప్రబుత్వ కార్యాలయాల్లో ఉండలేదు.. మీరు ఇష్టం వచ్చినట్టుగా వాగినా, జగన్ వెంట్రుక పీకలేరు అంటూ ఎప్పటిలా మళ్లి బూతులందుకున్నాడు.
2014 ఎలక్షన్ రిజల్ట్ తర్వాత సుప్పిని సుద్దపూసని అన్నట్టుగా మాట్లాడిన కొడాలి నాని పై టీడీపీ నేతలు, లోకేష్ యాక్షన్ తీసుకుంటారు, గత ఐదేళ్లుగా రెచ్చిపోయిన కొడాలిని లోకేష్ వదలడు అంటూ మట్లాడుకున్నప్పుడు సైలెంట్ గా ఉన్న కొడాలి.. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు వారాలైనా తనపై ఎలాంటి కేసులు పెట్టలేదు అనుకున్నాడో, లేదంటే జగన్ నీ వే లో నువ్వు రెచ్చిపో అని చెప్పి పంపాడో కానీ.. మరోసారి కొడాలి నాని తన పైత్యం చూపించాడు. అది చూసే కొడాలి కొవ్వు తగ్గలేదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.