నేషనల్ క్రష్ రష్మిక మందన్న చాలా ఎగ్జైట్ అవుతుంది. ప్రస్తుతం పలు భాషల్లో క్రేజీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి సెట్స్ మీదకి వెళ్లబోతుంది. హిందీలో యానిమల్ తో రచ్చ చేసిన రష్మిక ఇమ్మిడియట్ గా సల్మాన్ ఖాన్ సరసన ప్లేస్ దక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. దానితో రష్మిక అదృష్టాన్ని పొగడని వారే లేరు.
అల్లు అర్జున్ సరసన పుష్ప ద రూల్ లో నటిస్తుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కుబేర పాన్ ఇండియా మూవీ అబ్బో అమ్మడు చేతిలో అన్నీ పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. అందుకే పాప బాగా ఎగ్జైట్ అవుతూ కనిపిస్తుంది. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ తో రష్మిక నటిస్తున్న సికిందర్ సెట్స్ లోకి త్వరలో చేరనున్నట్లు స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఇక తాజాగా ఇటలీలో రష్మిక ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని వదిలింది. అందులో రష్మిక బ్లాక్ అండ్ వైట్ పిక్స్ లో మెరిసిపోయింది. ఆ తర్వాత ఫుడ్ తింటూ కూల్ గా రిలాక్స్ అవుతూ రష్మిక ఎంతగా ఎంజాయ్ చేస్తుందో ఆ పిక్స్ చూస్తే తెలుస్తుంది.