Advertisementt

వాళ్ళని బాగా మిస్ అవుతున్న ఏపీ ప్రజలు

Wed 19th Jun 2024 10:27 AM
ycp  వాళ్ళని బాగా మిస్ అవుతున్న ఏపీ ప్రజలు
People of AP who miss them very much వాళ్ళని బాగా మిస్ అవుతున్న ఏపీ ప్రజలు
Advertisement
Ads by CJ

వైసీపీ ప్రభుత్వంలో బూతు ఎమ్యెల్యేలుగా, బూతు మంత్రులుగా పేరు గాంచిన కొంతమంది వైసీపీ నేతలని ఏపీ ప్రజలు బాగా మిస్ అవుతున్నారట. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలైన రోజా, కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వంశి వల్లభనేని, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళని మిస్ అవుతున్నామంటూ పోస్ట్ లు పెడుతున్నారు.

అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లని తిడుతూ హైలేట్ అయ్యి జగన్ దగ్గర మార్కులు కొట్టేసి పదవులను పొంది బాగా వెనకేసుకున్న వారంతా ఓడిపోగానే సైలెంట్ గా పిల్లుల్లా మారిపోయారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అధికార మదంతో కొట్టుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకుంటూ మీడియా ముందు మాట్లాడేవారు.

చంద్రబాబు ముసలోడు, లోకేష్ పప్పు, పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు అంటూ కొడాలి నాని, రోజా లాంటి వాళ్ళు కారు కూతలు కూసేవారు.. ఇప్పుడు నోరు లేవదే అంటూ సోషల్ మీడియాలో వాళ్ళని మిస్ అవుతున్న నెటిజెన్స్ పెడుతున్న పోస్ట్ లు చూస్తే కొంతమంది నవ్వాపుకోలేకపోవుతున్నారు. మళ్లీ అధికారం మాదే అనే గర్వంతో రేపటి రోజు అనేది వాళ్ళకి లేనట్టుగా మాట్లాడి ఇప్పడు ఏమనాలో తెలియక పచ్చి వెలక్కాయ నోట్లో వేసుకుని కూర్చుంది బూతు బ్యాచ్ అంటూ నెటిజెన్స్ మాత్రం వాళ్ళని తెగ గుర్తు చేసుకుంటున్నారు. 

People of AP who miss them very much:

People of AP are missing YCP people very much

Tags:   YCP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ