ఎప్పుడు కాంట్రవర్సీలకి దగ్గరగా ఉండే జబర్దస్త్ మాజీ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ తర్వాత అంతగా నెల్లూరు చేపల పులుసు తో ఫేమస్ అయ్యాడు. ఇక ఆర్పీ రాజకీయంగా నాగబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పై అభిమానం చూపించడం కాదు.. వైసీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేస్తున్నాడు. తాను ఎంతగానో అభిమానించిన రోజా ని కూడా ఆర్పీ వదల్లేదు.
వైసీపీ ఓడిపోతుంది.. అందులో మా యువరాణి రోజా ముందుగా ఓడిపోతుంది అని కామెంట్స్ చేసిన ఆర్పీ.. వైసీపీ ఓడిపోయాక కూడా వాళ్ళని వదలట్లేదు. రోజా ని ఇమిటేట్ చేస్తూ తెగ ఏడిపించేసాడు. జగన్, రోజా, విజయసాయి రెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని ఇలా ఎవ్వరిని వదలకుండా ఆడుకున్న ఆర్పీ ఇప్పుడు రిషి కొండ ప్యాలెస్ పై కామెంట్స్ చేసాడు.
జగన్ మోహన్ రెడ్డి రిషి కొండ పై 60 ఎకరాల కొండని కూల దొయించి 500 కోట్లతో రిసార్ట్స్ కట్టుకున్నాడు. అది ఎవరికి కావాలి, బోలెడంత ఆదాయం వచ్చే రిసార్ట్స్ కూలదోసి పరదాల మాటున రిషి కొండ ప్యాలెస్ కట్టాడు జగన్ మోహన్ రెడ్డి. అదే పేదల కోసం కట్టిన ఇళ్ళని ఇవ్వకుండా అక్కడ వాటర్ సదుపాయం, డ్రైనేజి సదుపాయం లేకుండా పేదలని అగచాట్లు పెడుతూ నువ్వు రిషికొండ ప్యాలెస్ ని కట్టించుకున్నావంటూ కిర్రాక్ ఆర్పీ జగన్ మోహన్ రెడ్డిపై విరుచు పడ్డాడు.
అది చూసిన నెటిజెన్స్ ఏంటయ్యా వైసీపీ ఓడిపోయినా వాళ్ళని వదలకుండా ఇలా తగులుకున్నవేమిటయ్యా అంటూ కామెంట్ చేస్తున్నారు.