Advertisementt

అజిత్ కి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన షాలిని

Wed 01st May 2024 01:01 PM
shalini  అజిత్ కి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన షాలిని
Shalini Gave A Wonderful Birthday Gift To Ajith అజిత్ కి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిన షాలిని
Advertisement
Ads by CJ

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పుట్టిన రోజు నేడు బుధవారం. అజిత్ 53వ పుట్టినరోజుని సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. తలా అజిత్ పుట్టిన రోజు స్పెషల్ గా ఆయన అభిమానులు కేక్ కట్ చేసి టపాసులు పేలుస్తూ అజిత్ కటౌట్ కి పాలాభిషేకాలు చేస్తున్నారు. అజిత్ ప్రస్తుతం మగిజ్ తిరుమేని దర్శకత్వంలో విదా ముయార్చి చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా  ఉన్నారు. 

అజిత్ బర్త్ డే కి ఆయన భార్య షాలిని అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వడం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. షాలిని భర్త కోసం అదిరిపోయే కాస్ట్లీ డుకాటీ కార్ కానుక‌గా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్ర‌స్తుతం ఈ గిఫ్ట్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ సోషల్ మీడియాలో  వైర‌ల్ గా మారాయి. అజిత్ నటి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

షాలిని అజిత్ తో వివాహం తర్వాత నటనకు దూరంగా ఉంటూ ఫ్యామిలీని చూసుకుంటుంది. అజిత్ సినిమా షూటింగ్స్, కార్ రేస్, బైక్ రేస్ లంటూ చాలా బిజీగా ఉండే పర్సన్. ఖాళీ సమయాల్లో భార్య షాలిని, పిల్లలతో కలిసి సరదాగా వెకేషన్స్ కి వెళుతూ ఉంటారు. నేడు భర్త పుట్టిన రోజు సందర్భంగా షాలిని ఇచ్చిన గిఫ్ట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. 

Shalini Gave A Wonderful Birthday Gift To Ajith:

 Shalini Presents A Ducati To Ajith As Birthday Gift

Tags:   SHALINI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ