ఏడాదిన్నరగా చడి చప్పుడు లేని హరి హర వీరమల్లు మేకర్స్ ఈమధ్యన అప్పుడప్పుడు టీజర్ అప్ డేట్స్ తో పవన్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఈమధ్యనే హరి హర వీరమల్లు టీజర్ ధర్మం యుద్ధం కోసం అంటూ అప్ డేట్ ఇచ్చిన మేకర్స్.. ఇప్పుడు ఏకంగా టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు.
పవన్ కళ్యాణ్ షూటింగ్ లో యాక్టీవ్ గా లేని సమయంలో ఉన్నట్టుండి వీరమల్లు టీజర్ అప్ డేట్ ఇస్తే.. ఏమనుకోవాలి. పవన్ కళ్యాణ్ కి రాజకీయంగా హెల్ప్ అయ్యే విధంగా ఏమైనా హరి హర వీరమల్లు టీజర్ కట్ చేసారా.. దర్శకుడు క్రిష్ జనసేన గురించి ప్రజలకి ఏమైనా మెసేజ్ ఇచ్చే విధముగా హరి హర వీరమల్లు టీజర్ ఇవ్వబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది.
ధర్మం కోసం యుద్ధం అంటే పవన్ కళ్యాణ్ ధర్మం కోసం ఏపీ ఎన్నికల్లో పోరాటం చేస్తున్నారని అర్ధం అంటూ పవన్ కళ్యాణ్ ఫాన్స్, జనసైనికులు భావిస్తున్నారు. మరి పిరియాడికల్ డ్రామా నుంచి ఎన్నికలకు ఉపయోగపడే టీజర్ అంటే కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. చూద్దాం మే 2 న ఉదయం 9 గంటలకి రాబోతున్న వీరమల్లు టీజర్ లో ఏమేమి ఉండబోతున్నాయో అనేది.