కోలీవుడ్ నటి శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ శాంతను కి బ్రేకప్ చెప్పేసిందా.. అంటే అవుననే అంటుంది కోలీవుడ్ మీడియా. ఎప్పుడు బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపించే శృతి హాసన్ ఈమధ్యన ఒంటరిగా కనబడుతుంది. అంతేకాదు.. శృతి హాసన్, శాంతను ఇద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో ఫాలో కూడా అవ్వడం లేదు. అందుకే శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఇక శృతి హాసన్ మాత్రం శాంతను తో బ్రేకప్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఏదైనా ఓపెన్ గా మాట్లాడే శృతి హాసన్ ఈ బ్రేకప్ విషయంలో ఎందుకు మౌనం వహిస్తుందో అనేది ఆమె అభిమానులకి అస్సలు అర్ధం కావడం లేదు. ఇదొక క్రేజీ రైడ్.. నా గురించే కాకుండా ఇతర వ్యక్తుల గురించి చాలా తెలుసుకున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఇండైరెక్ట్ గా రీసెంట్ గా రియాక్ట్ అయ్యింది.
శృతి ఎలా ఉంటే మాత్రం ఏమిటి.. శాంతను మాత్రం ఈ బ్రేకప్ పై సూపర్ క్లారిటీ ఇచ్చాడు. నన్ను క్షమించండి.. నేను దానిపై ఏమి మట్లాడాలనుకోవడం లేదు అంటూ బాంబే టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం చూసిన వారు.. శృతి హాసన్-శాంతను మధ్యలో విభేదాల కారణంగానే వారిద్దరూ ఫ్రెండ్లిగా బ్రేకప్ చెప్పుకున్నారని, అందుకే ఈ విషయంపై వారు ఏమి మాట్లాడడం లేదు అని అంటున్నారు.