Advertisementt

అప్పుడు రష్మిక.. ఇప్పుడు విజయ్!

Wed 24th Apr 2024 10:17 AM
vijay deverakonda  అప్పుడు రష్మిక.. ఇప్పుడు విజయ్!
Vijay Deverakonda at His Security Guard Marriage అప్పుడు రష్మిక.. ఇప్పుడు విజయ్!
Advertisement
Ads by CJ

చాలామంది హీరోలు తన దగ్గర పని చేసే వాళ్ళని సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తారు. వారికి కావలసిన సహాయం చెయ్యడం దగ్గర నుంచి వారి ఇంట్లో జరిగే శుభకార్యాలకు అటెండ్ అవడం వరకు చేస్తూ ఉంటారు. మొన్నీమధ్యనే రష్మిక తన మేనేజర్ పెళ్ళిలో తెగ హడావిడి చేసింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ తన దగ్గర పని చేసే పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ పెళ్ళికి వెళ్లి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. 

ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ తర్వాత మౌనంగా తన పని తానూ చేసుకుంటున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం VD 12 షూటింగ్‌తో బిజీ అయ్యాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ పెళ్ళికి వెళ్ళాడు. అది కూడా కుటుంబ సమేతంగా వెళ్లి అక్కడ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. 

విజయ్ దేవరకొండ, ఆయన తల్లిదండ్రులు అందరూ ఆ పెళ్ళిలో సందడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. విజయ్‌ని ఈ పెళ్లిలో పెళ్ళికొడుకు కుటుంబం శాలువా‌తో సత్కరించింది. అది చూసిన రౌడీ ఫాన్స్ ఉత్సాహంగా ఆ వీడియోని షేర్ చేస్తున్నారు.

Vijay Deverakonda at His Security Guard Marriage:

Vijay Deverakonda Family Attends Their Security Guard Marriage

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ