గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గత గురువారం హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ముంబై వెళ్లారు. ఎన్టీఆర్ ముంబై లో అడుగుపెట్టగానే ఆయన అభిమానులు ఎన్టీఆర్ ని చూసేందుకు వార్ 2 సెట్స్ కి వచ్చేసారు. ఎన్టీఆర్ ముంబై లో కదిలినా మెదిలినా బాలీవుడ్ మీడియా స్పెషల్ గా కవర్ చెయ్యడమే కాదు.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేవారు. అక్కడ జిమ్ కి వెళ్లి ఎన్టీఆర్ ఉర్వశితో సెల్ఫీ, జిమ్ ట్రైనర్ తో పిక్ అలా చాలా స్పెషల్ గా కనిపించారు.
ఇక వార్ 2 లో హృతిక్ రోషన్ తో కలిసి కాంబో సీన్స్ కోసం డేట్స్ కేటాయించిన ఎన్టీఆర్ ఈ వారం రోజులుగా షూటింగ్ లోనే మునిగిపోయారు. ఎన్టీఆర్-హృతిక్ రోషన్ వార్ 2 సెట్స్ కి వెళుతున్న సందర్భంలో వాళ్ళ లుక్స్ ని కొంతమంది లీక్ చెయ్యగా అవి సెన్సేషన్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 మొదటి షెడ్యూల్ కి పేకప్ చెప్పేసారు.
దానితో ఎన్టీఆర్ తిరిగి హైదెరాబాద్ కి పయనమయ్యారు. ఆయన తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఆయన ముంబై నుంచి హైదరాబాద్ కి పయనమైన వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్ మరి కాసేపట్లో హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్ట్ కి ఎన్టీఆర్ చేరుకునే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్ తదుపరి దేవర షూటింగ్ కోసం రెడీ అవుతారని తెలుస్తుంది.