జబర్దస్త్ కామెడీ షో తో ఎంతోమంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వెండితెర మీద వెలుగొందుతున్నారు. కొంతమంది బుల్లితెర మీద వెలిగిపోతుంటే.. కొంతమంది వెండితెర మీద తమ ప్రత్యేకతని చాటుకుంటున్నారు. సుధీర్ లాంటి కమెడియన్ హీరోగా మారితే.. గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి లాంటి వాళ్ళు కామెడీ చేస్తూ స్టార్ హీరోల సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇక వేణు అయితే బలగం చిత్రంతో దర్శకుడిగా మారాడు.
అయితే జబర్దస్త్ ని వద్దు అందులో అవమానపడుతున్నామని బయటికి వచ్చేసిన వారు తరచూ జబర్దస్త్ పై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అందులో కిర్రాక్ ఆర్పీ ఒకడు. జబర్దస్త్ యాజమాన్యంపై ఆర్పీ చాలాసార్లు ఫైర్ అయ్యాడు. తాజాగా మరో కమెడియన్ జబర్దస్త్ పై సంచలన కామెంట్స్ చేసాడు. అతనే అదిరే అభి టీం లో చేసే గెడ్డం నవీన్. అదిరే అభి జబర్దస్త్ వదిలి మరో ఛానల్ కి అలాగే సిల్వర్ స్క్రీన్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెళ్ళాడు.
అభి జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాక అతని టీం చెల్లా చెదురైపోయింది. అభి వెళ్ళాక తమను ఎవ్వరూ పట్టించుకోలేదని గడ్డం నవీన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. అభి వెళ్ళాక జబర్దస్త్ వేదికపై సరిగ్గా కన్పించట్లేదని చెప్పాడు. అంతేకాకుండా జబర్దస్త్ లో డబ్బులు ఇస్తున్నారా.. అనే ప్రశ్నకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. కాస్త తెలిసినవాళ్లయితే ఇస్తారు, తెలియని వాళ్ళైతే ఇవ్వరని చెప్పుకొచ్చాడు గడ్డం నవీన్.
తాను జబర్దస్త్ షోలో 80 నుంచి 90 ఎపిసోడ్లు చేసినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనిచెప్పి షాకిచ్చాడు. మరి జబర్దస్త్ కమెడియన్స్ అంతా కార్లు, బంగ్లాలు కొని సెటిల్ అయితే నవీన్ ఏంటి ఇలా మాట్లాడాడు అంటూ చర్చించుకుంటున్నారు.