యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర షూటింగ్ నిన్నమొన్నటివరకు ఫుల్ స్వింగ్ లోనే సాగింది. కాకపోతే ఎన్టీఆర్ ముంబై కి వార్ 2 షూటింగ్ కోసం వెళ్లడం వలన దేవర షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. దేవర చిత్రంపై ఉన్న క్రేజ్ తో ఈ చిత్ర డిజిటల్ హక్కులని ఇప్పటికే ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇప్పుడు దేవర నార్త్ రైట్స్ ని కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ సంస్థ చేజిక్కించుకుంది. దానితో నార్త్ రైట్స్ పై ఎలాంటి టెన్షన్ లేదు. ఇకపోతే శాటిలైట్ హక్కులు ఇంకో నెలలో క్లోజ్ అయిపోతాయి అని తెలుస్తోంది. ఇక ఇప్పుడు దేవర రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ హక్కుల కోసం భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల అన్ని ఏరియా లకి కలిపి దేవర కి 120 కోట్లతో మొదలుపెట్టి ప్రొడ్యూసర్స్ 140 కోట్లు కోటిషన్ వేసినట్లుగా తెలుస్తుంది. ఈ రేంజ్ లో అంటే 120 నుంచి 140 మధ్యలో దేవరకి డీల్ సెట్ అయితే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్ అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ ని రామ్ చరణ్ తో కలిసి పంచుకున్నాడు కాబట్టి. సోలోగా దేవర ఎన్టీఆర్ కి ఇది భారీ డీల్ అనే చెప్పాలి.
ఇకపోతే దేవర చిత్రాన్ని అక్టోబర్ 10 కి విడుదల చేస్తున్నారు. ఈలోపులో దేవర పై క్రేజీ క్రేజీ అప్ డేట్స్ వదిలి మరింతగా అంచనాలు పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.