వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. రాయితో దాడి చేయడంతో జగన్ తలకు.. కంటికి గాయమై తీవ్ర రక్త స్రావం అయ్యింది. త్రుటిలో జగన్ కన్నుకు గాయం తప్పినది. రాయి బలంగా తాకడంతో జగన్ ఎడమ కంటి దగ్గర గాయం అయ్యింది. కన్ను కూడా వాచింది. వెంటనే పక్కనే ఉన్న సిఎంఆర్ఎఫ్ హరికృష్ణ ప్రాథమిక చికిత్స చేశారు. ఇదంతా టీడీపీ కార్యర్తల పనేనని వైసీపీ ఆరోపిస్తోంది. శనివారంనాడు మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా విజయవాడకు విచ్చేశారు జగన్. ఈ క్రమంలో ఘటన జరిగింది.
కృష్ణా జిల్లాలో జగన్ రెడ్డికి ఇంత ఆదరణ వస్తుందని ఊహించని చంద్రబాబు.. ఇలా చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎంకు వస్తున్న ఆదరణ తట్టుకోలేక కడుపు మంటతో దాడికి తెగబడ్డారు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. మొన్నే జగన్ రెడ్డి పిల్ల బచ్చా.. నేనేంటో ఏం చేస్తానో నీకు చూపిస్తా అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇదంతా చంద్రబాబు పనేనని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై టీడీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి మరి.