టిల్లు స్క్వేర్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ చుక్కలు చూపించినంత పని చేసారు. అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మెరిసింది. బ్లాక్ శారీ లో అనుపమ స్లీవ్ లెస్ బ్లౌజ్ తో కాస్త గ్లామర్ గా దర్శనమిచ్చింది మరో హీరోయిన్ నేహా శెట్టితో కలిసి సందడి చేసింది. టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో అనుపమకు స్పీచ్ ఇచ్చే సమయంలో ఎన్టీఆర్ ఫాన్స్ చేసిన గోలకి ఆమె ఏమి చెయ్యలేక చేతులెత్తేసింది.
అనుపమ పరమేశ్వరన్ స్టేజ్ పైకి వెళ్ళి సుమ చేతిలో మైక్ తీసుకునే సమయంలో ఎన్టీఆర్ ఫాన్స్ నానా గోల చేసారు. అనుపమని అసలు మాట్లాడనివ్వలేదు. ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూ ఎన్టీఆర్ అప్పుడే రావడంతో ఫాన్స్ నానా రచ్చ చేసారు. ఎన్టీఆర్ లేచి నమస్కారం చేస్తూ సైలెంట్ గా ఉండమని కూడా చెప్పారు.
అనుపమ అయితే సరే స్టేజ్ దిగి వెళ్లిపోతానని చెప్పినా ఎన్టీఆర్ ఫాన్స్ వినలేదు, ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గోల గోల చేసేసారు. మరి స్టార్ హీరోలు ఇలా అప్పుడపుడు బయట కనబడితే వాళ్ళ ఫాన్స్ ఎంతెలా ఆవేశపడతారో అనేది టిల్లు స్క్వేర్ ఈవెంట్ లో చూసే ఉంటారు.