దర్శకధీరుడు రాజమౌళి.. మహేష్ బాబు తో తెరకెక్కించనున్న SSMB 29 అప్ డేట్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు రాజమౌళి-మహేష్ కాంబో మూవీ ఓపెనింగ్ కోసం వెయిటింగ్. మరి ఉగాది రోజున SSMB 29 అప్ డేట్ ఉండబోతుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగానే జరిగింది. కానీ ఎక్కడా దానికి సంబందించిన హడావిడి కనిపించడం లేదు.
రాజమౌళి మాత్రం మహేష్ మూవీకి సంబంధించి స్రిప్ట్ వర్క్ పూర్తయినట్లుగా చెప్పడమే కాదు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జెట్ స్పీడులో జరుగుతుంది అంటూ ఎప్పుడో చెప్పారు. అయితే ఇంకా నటుల ఎంపిక చేపట్టలేదు, హీరోగా మహేష్ ని మాత్రమే అనుకున్నామని ఆయన చెప్పారు. ఈమద్యలో సోషల్ మీడియాలో ఈ నటులు SSMB 29 లో భాగం కాబోతున్నారు, హాలీవుడ్ నటి మహేష్ కి జోడిగా కనిపించబోతుంది అంటూ ప్రచారం జరిగింది.
తాజాగా మహేష్ కోసం రాజమౌళి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ని సంప్రదించే పనిలో ఉన్నారంటూ ఓ న్యూస్ వైరల్ అయ్యింది. SSNMB 29 లో మరో కీలక పాత్ర ఉంటుందని.. ఈ పాత్రలో మరో బాలీవుడ్ స్టార్ హీరోని తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో అమీర్ ఖానే అని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమున్నా లేకపోయినా.. మహేష్ తో అమీర్ ఖాన్ నటించడం అనే న్యూస్ మహేష్ ఫాన్స్ ని ఎంజాయ్ చేసేలా చేసింది.