Advertisementt

తీరిక లేని మెగాస్టార్

Sun 07th Apr 2024 11:49 AM
vishwambhara  తీరిక లేని మెగాస్టార్
Vishwambhara Hyderabad Schedule Update తీరిక లేని మెగాస్టార్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ ఈమధ్యన ఏ పబ్లిక్ ఈవెంట్ లో చూసినా సరదాగా కనిపిస్తున్నారు. మరోపక్క ఆయన నటిస్తున్న విశ్వంభర షూట్ లో తీరిక లేకుండా గడుపుతున్నారు. వసిష్ఠ దర్శత్వంలో మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. నిన్నమొన్నటివరకు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ జరిగింది. 

ఇప్పుడు కూడా 20 రోజుల పాటు ఓ భారీ షెడ్యూల్ ని వసిష్ఠ ప్లాన్ చేసాడు. హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్ లో విశ్వంభర యాక్షన్ సీక్వెన్స్ అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్ ని వసిష్ఠ చిత్రీకరిస్తున్నారు. మెగాస్టార్ కూడా ఉదయం 4 గంటలకే షూటింగ్ కి హాజరవుతున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్ శివారు ప్రాంతంలో రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీలో విశ్వంభర ఫైట్ సీక్వెన్స్ షూట్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరు కి జోడిగా త్రిష నటిస్తుంది. 

ఇప్పటికే చిరు-త్రిష లపై ఓ సాంగ్ ని వసిష్ఠ కంప్లీట్ చేసాడు. కొద్దిరోజులుగా విశ్వంభర యాక్షన్ సీక్వెన్స్ ని వసిష్ఠ తెరకెక్కిస్తున్నారు. ఈ 20 రోజుల షెడ్యూల్ ఫినిష్ అవ్వగానే చిరు భార్య సురేఖ తో కలిసి సమ్మర్ హాలిడే ట్రిప్ కింద యూరప్ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. 

Vishwambhara Hyderabad Schedule Update :

Vishwambhara shooting update 

Tags:   VISHWAMBHARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ