Advertisementt

ఫ్యామిలీ స్టార్ or సీరియల్ స్టార్

Sat 06th Apr 2024 12:09 PM
family star  ఫ్యామిలీ స్టార్ or సీరియల్ స్టార్
Family Star or Serial Star ఫ్యామిలీ స్టార్ or సీరియల్ స్టార్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ - పరశురామ్ కలయికలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ ఈ శుక్రవారం ఏప్రిల్ 5 న థియేటర్స్ లో విడుదలైంది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ పై చాలా కాన్ఫిడెన్స్ తో కనిపించాడు. దిల్ రాజు తో కలిసి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ నిజంగానే ఫ్యామిలీస్ లోకి తీసుకెళ్లేందుకు చాలా కష్టపడ్డాడు. మరి ఫ్యామిలీ స్టార్ చూసిన ఫ్యామిలీ ప్రేక్షకులు ఎలా ఫీలవుతున్నారో అనేది సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కనిపిస్తుంది.

ఫ్యామిలీ స్టారా.. కాదు కాదు అది సీరియల్ స్టార్. సీరియల్ లో కథలు లేకుండా సాగదీసినట్టుగా పరశురామ్ ఫ్యామిలీ స్టార్ ని సాగదీసాడు. సీరియల్ నడవాలంటే అందులో కథానాయకుడు, లేదా కథానాయకి తన ఫ్యామిలీ భారాన్ని మోస్తూ కనిపిస్తారు. చదువుకునే చెల్లి, చిన్న తమ్ముడు, తాగుబోతు తండ్రి, లేదా తండ్రి లేకపోవడం, బాధ్యత లేని అన్న ఇలా ఉన్న ఫ్యామిలీకి ఆటో నడుపుతూనో, లేదంటే ఒక జాబ్ చేసుకుంటూ అన్ని తానై, తాను మాత్రం త్యాగం చేసే వ్యక్తిగానే కనిపిస్తారు సీరియల్స్ లో.

సేమ్ ఫ్యామిలీ స్టార్ చిత్రంలో కథ ఉండదు. తాగుబోతు అన్న, నిలకడలేని మరో అన్న, బంగారం లాంటి వదినలు, వాళ్ళ పిల్లలు, ఇంటికి పెద్ద దిక్కు నాన్నమ్మ కోసం పాటుబడే మిడిల్ క్లాస్ కుర్రాడు. ఇది ఫ్యామిలీ స్టార్ కథ. రొటీన్ గానే అలాంటి ఫ్యామిలీ స్టార్ ని ప్రేమించే ఓ రిచ్ అమ్మాయి. ఇదంతా సీరియల్స్ చూసి చూసి ఉన్న ఫ్యామిలీకి బోర్ కొట్టే అంశం.. అంటూ చాలామంది అభిప్రాయం పడుతున్నారు. 

అలా ఫ్యామిలీ స్టార్ మూవీని చూసిన చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ ఇది ఫ్యామిలీ స్టారా.. లేదంటే సీరియల్ స్టారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది పరశురామ్ దగ్గర వరకు వెళితే ఆయనెలా స్పందిస్తారో చూడాలి.

Family Star or Serial Star:

Family Star Public Talk

Tags:   FAMILY STAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ