Advertisementt

జాన్వీ.. పెళ్ళికి ఎందుకంత తొందర

Tue 02nd Apr 2024 10:04 PM
boney kapoor  జాన్వీ.. పెళ్ళికి ఎందుకంత తొందర
Is Janhvi Kapoor Getting Ready for Marriage? జాన్వీ.. పెళ్ళికి ఎందుకంత తొందర
Advertisement
Ads by CJ

ఇప్పుడిప్పుడే కెరీర్ లో అద్భుతమైన అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతున్న జాన్వీ కపూర్ అప్పుడే పెళ్లి పీటలెక్కబోతుందా? ఈ వార్త విన్న శ్రీదేవి ఫాన్స్ కి ఒక్కసారిగా షాకవుతున్నారు. జాన్వికి బాయ్ ఫ్రెండ్ ఉండడం వేరు, బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ చెయ్యడం వేరు, కానీ బాయ్ ఫ్రెండ్ తో ఇంత చిన్న వయసులో పెళ్లి పీటలెక్కడం అనేదే షాకింగ్ విషయం. ఇది అభిమానులని తొలిచేస్తున్న ప్రశ్న. జాన్వీ కపూర్ ఎప్పటి నుంచో శిఖ‌ర్ ప‌హారియాతో డేటింగ్ లో ఉంది అనే ప్రచారం జరుగుతుంది. శిఖ‌ర్ ప‌హారియాతో కలిసి పార్టీలు, దేవుడి దర్శనాలు అంటూ చాలా బిజీగా ఉంటుంది. 

అయితే అది డేటింగ్ వరకే, ప్రేమ ఉన్నా ఇప్పుడప్పుడే పెళ్లి పీటలెక్కే ఛాన్స్ లేదనే అనుకున్నారు. కానీ జాన్వీ కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఆమె తండ్రి బోని కపూర్ అనౌన్స్ చెయ్యడం మాత్రం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. హిందీ చిత్రాల్లో నటించినా పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేని జాన్వీ కపూర్ కి ఇప్పుడిప్పుడే సౌత్ లో పాన్ ఇండియా ఆఫర్స్ అందుకుంటుంది. 

గ్లోబల్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీ చేస్తుంది. అవి ఇంకా విడుదల కాలేదు. ఆమెకి పెద్ద పెద్ద సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ వుంది. కానీ ఇలాంటి సమయంలో జాన్వీ కపూర్ పెళ్లి చేసుకోవడం మాత్రం అభిమానులకి నచ్చడం లేదు. జాన్వీ పెళ్ళికి ఎందుకింత తొందర అనే కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టుగా బోనీ క‌పూర్ అనౌన్స్ చెయ్యడమే కాదు త్వ‌ర‌లో ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లి డేట్‌ కూడా చేబుతామని స్వయంగా ఆయనే చెప్పడంతో బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అయితే బోని  కపూర్ మాత్రం తన భార్య శ్రీదేవి జాన్వీ కపూర్ నటి కాకూడదు, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని కలలు కనేది అంటూ చెప్పారు. మరి మీడియా మాత్రం బోని జాన్వీ పెళ్లి పై అనౌన్స్ చేసారని అంటుంది. 

Is Janhvi Kapoor Getting Ready for Marriage?:

Boney Kapoor on how Sridevi dreamt of getting Janhvi Kapoor married 

Tags:   BONEY KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ