Advertisementt

ఫ్యామిలీ స్టార్ అదృష్టం మాములుగా లేదు

Tue 02nd Apr 2024 11:38 AM
vijay deverakonda  ఫ్యామిలీ స్టార్ అదృష్టం మాములుగా లేదు
Family Star releasing on April 5th ఫ్యామిలీ స్టార్ అదృష్టం మాములుగా లేదు
Advertisement
Ads by CJ

ఏప్రిల్ 5 డేట్ నుంచి ఎన్టీఆర్ దేవర తప్పుకోవడంతో ఆ తేదీపై కన్నేసిన ఫ్యామిలీ స్టార్ అదేనండి విజయ్ దేవరకొండ వెంటనే ఏప్రిల్ 5 పై కచ్చిఫ్ వేసేసి ఫ్యామిలీ స్టార్ రిలీజ్ తేదీని ప్రకటించేశాడు. ఏప్రిల్ 5 టార్గెట్ గా ప్రమోషన్స్ చేస్తూ అందరిలో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసాడు. నిర్మాత దిల్ రాజు కూడా విజయ్ తో కలిసి డిఫరెంట్ గా ఫ్యామిలీ స్టార్ ని ప్రమోట్ చేస్తున్నారు. 

అయితే గత వారం విడుదలైన టిల్లు స్క్వేర్ తప్పితే ఫ్యామిలీ స్టార్ కి వచ్చిన ప్రమాదం ఏమి లేదు. అదే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కి కాస్త హిట్ టాక్ వచ్చింది అంటే చాలు సినిమాకి మాములు అదృష్టం పట్టదు. అంటే ఈ శుక్రవారం జగ్ జీవన్ రావ్ జయంతి, స్టూడెంట్స్ కి హాలిడే. ఇక ఆ తర్వాత మంగళవారం ఉగాది పండుగ సెలవు ఆ వెంటనే రంజాన్ సెలవు. సో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కి ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ దక్కినా దిల్ రాజు సేఫ్. 

అసలే వేసవి సెలవలు. పిల్లలు క్రేజీ సినిమాలు ఏవి విడుదల కావడం లేదనే డిస్పాయింట్ లో ఉన్నారు. అదే సమయంలో ఫ్యామిలీ స్టార్ వస్తుంది. ఫ్యామిలీ స్టార్ హావ ఏప్రిల్ 5 నుంచి మొదలై ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. 

Family Star releasing on April 5th:

Vijay Deverakonda Family Star bookings opened

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ