Advertisementt

ప్రేమలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Mon 01st Apr 2024 07:14 PM
premalu  ప్రేమలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Premalu OTT Streaming Date Fix ప్రేమలు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Advertisement
Ads by CJ

మలయాళంలో ఈమధ్యన విడుదలైన సినిమాలు మిగతా లాంగ్వేజెస్ లో డబ్ అయ్యి దుమ్మురేపుతున్నాయి. అందులో ఫిబ్రవరి, మార్చ్ లలో విడుదలైన భ్రమయుగం, ప్రేమలు, మంజుమెల్‌ బాయ్స్‌.. ఈ మూడు సినిమాలు మలయాళంలో సూపర్ సక్సెస్ అవడమే కాదు.. తెలుగులోనూ డబ్ అయ్యి భ్రమయుగం, ప్రేమలు అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకోగా.. ఇప్పుడు మంజుమెల్‌ బాయ్స్‌ తెలుగు థియేటర్స్ లో విడుదల కాబోతుంది. 

అందులో 5 కోట్లు పెట్టి నిర్మించిన ప్రేమలు చిత్రం ఒక్క మళయాళంలోనే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి రూ.120 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. తెలుగు లో అయితే ఏకంగా రూ.14 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది. దానితో ప్రేమలు మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్ మొత్తం ఎదురు చూస్తుంది. అయితే ఇంతకుముందు ప్రేమలు మార్చ్ 29 నే ఓటీటీలోకి రాబోతుంది అనే ప్రచారం జరిగింది. కానీ ఈ వారం అది జరగలేదు. 

తాజాగా ప్రేమలు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 12 నుంచి డిస్నీ +హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ చిత్రం స్ట్రిమింగ్ కు రావడం ఖరారైంది. అది పోస్టర్ తో సహా ప్రకటించారు. అయితే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం స్ట్రిమింగ్ లోకి రానుంది. కానీ హింది, కన్నడ వెర్షన్ గురించి ఇంకా అప్డేట్ రాలేదు.

Premalu OTT Streaming Date Fix:

Premalu OTT Streaming Date locked

Tags:   PREMALU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ