Advertisementt

ఈ మరపురాని రోజు.. మౌనమేల!

Fri 05th Apr 2024 11:51 AM
allu vs mega  ఈ మరపురాని రోజు.. మౌనమేల!
News on Mega Family and Allu Family Bonding ఈ మరపురాని రోజు.. మౌనమేల!
Advertisement
Ads by CJ

మెగా-అల్లు ఫ్యామిలీ మధ్యన మంచి అనుబంధం ఉన్నా.. ఆ ఇళ్లల్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని మీడియా భూతద్దం పెట్టి వెతుకుతూ వాళ్ళని పదే పదే డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. వారి మద్యన ఈగో క్లాష్ ఉంది, మెగా హీరోల మధ్యన కోల్డ్ వార్ జరుగుతుంది, రామ్ చరణ్ ఎదుగుదలని అల్లు అర్జున్ సహించలేడు, అల్లు అర్జున్ సోలోగా ఎదగడం చరణ్‌కి నచ్చదు, మెగా ఫ్యామిలీ అన్న మాటే కానీ, వారి మధ్యన చాలా గొడవలు ఉన్నాయి అంటూ ఎప్పటి నుంచో మీడియాలో కనిపించే వార్తలే.

గత ఏడాది రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి అల్లు అర్జున్ హాజరు కాకపోవడం, సోషల్ మీడియాలోనూ అల్లు అర్జున్.. చరణ్‌ని విష్ చేయకపోవడంపై సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరిగిందో అందరూ చూశారు. మళ్ళీ ఇప్పుడు అదే మాదిరి మరో సంఘటన అల్లు-మెగా ఫ్యామిలీ విషయంలో హైలెట్ అయ్యింది. అదేమిటంటే అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ వేడుకకి అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. శుక్రవారం మీడియా, సోషల్ మీడియాలో సౌత్ హీరోకి దక్కిన అరుదైన గౌరవం, అల్లు అర్జున్‌కి మైల్ స్టోన్ మూమెంట్ అంటూ అందరూ కొనియాడారు. 

అయితే ఇంత పెద్ద అచీవ్‌మెంట్ సాధించిన అల్లు అర్జున్‌ని మెగా ఫ్యామిలీ హీరోలెవరూ అభినందించకపోవడం చాలామందిని ఆశ్చర్యపరచగా.. ఇలాంటిది ఎప్పుడు జరుగుతుందా వారిని ఏకి పారేద్దామా అని కాచుకుని కూర్చున్న ఓ వర్గం మీడియా ఎప్పటిలాగే తన పని మొదలు పెట్టేసింది. మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఈ మరపురాని రోజు మౌనమేలనోయి అంటూ పుల్లలు పెట్టే ప్రయత్నం చేసింది. 

మరి నేషనల్ అవార్డు సాధించిన రోజు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అందరూ విష్ చేసారు. ఇప్పుడు ఈ విగ్రహం గురించి అభినందించే ఉంటారు. కానీ సోషల్ మీడియాలో అభినందించకపోవడం ఇప్పుడు పెద్ద తప్పైపోయింది.

News on Mega Family and Allu Family Bonding:

Mega Family Silent on Allu Arjun Wax Statue Achievement

Tags:   ALLU VS MEGA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ