Advertisementt

అనుపమ అంతలా ఫీల్ అయ్యిందా?

Thu 28th Mar 2024 08:07 PM
anupama  అనుపమ అంతలా ఫీల్ అయ్యిందా?
Does Anupama feel like that? అనుపమ అంతలా ఫీల్ అయ్యిందా?
Advertisement
Ads by CJ

అనుపమ పరమేశ్వరన్ ట్రెడిషనల్ వేర్ నుంచి గ్లామర్ గా మోడరన్ లుక్ లో మారడం ఆమె అభిమానులకి అస్సలు నచ్చలేదు. ఆమెని సాంప్రదాయ పద్దతిలోనే ఇష్టపడిన వారు గ్లామర్ గా టర్న్ అవడం జీర్ణించుకోలేకపోతున్నారు. అనుపమ బోల్డ్ గా డీజే టిల్లులో నటించడంపై ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నిరసన తెలియజెయ్యడమే కాదు.. ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేస్తున్నారు. 

అయితే ఎప్పుడు పులిహోర తినలేము కదా, అప్పుడప్పుడు బిర్యానీ కూడా తినాలి, అయినా నా కెరీర్ లో ఇప్పటివరకు ఒకేమాదిరి చేసిన రోల్స్ బోర్ కొట్టేసాయి అందుకే ఇలాంటి బోల్డ్ కేరెక్టర్ చేశాను అని డైరక్ట్ గానే మీడియా అడిగిన ప్రశ్నకి అనుపమ పరమేశ్వరన్ డేరింగ్ గా ఆన్సర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు అనుపమ ఈ ట్రోల్స్ కి భయపడి టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. 

అందుకే అనుపమ మీడియా ముందుకు రాలేదు, కేవలం టీం ఇంటర్వూస్ కి మాత్రమే హాజరయ్యింది అంటూ చెప్పుకుంటున్నారు. సిద్దు కూడా టిల్లు స్క్వేర్ కొత్త పోస్టర్ కింద రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మీరు కామెంట్ చేస్తే సరదాగా ఉండాలి కానీ వల్గర్ గా ఉండకూడదు, దయచేసి ఆమెని ఇబ్బంది పెట్టొద్దు, ఆ కామెంట్స్ చూసి అనుపమ అప్ సెట్ అయ్యింది, హార్ట్ అయ్యింది అంటూ అనుపమ పరమేశ్వరన్ గురించి ఈవెంట్ లో రిక్వెస్ట్ చేయడం చూసిన వారు అవునా.. నిజమేనేమో అనుపమ బాగా హార్ట్ అయ్యి ఉంటుంది అందుకే ఈవెంట్ కి రాలేదు అంటూ గుసగుసలాడుకుంటున్నారు. 

Does Anupama feel like that?:

Siddhu revealed that Anupama mood was spoiled and she was upset

Tags:   ANUPAMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ