సీతారామం, హాయ్ నాన్న బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో మెరిసిపోతుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో మొదలు పెట్టాడు. ఇకపై మృణాల్ ఠాకూర్ కూడా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగం కాబోతుంది ఛానళ్ల ఇంటర్వూస్, ప్రెస్ మీట్స్, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్, సోలో ఇంటర్వ్యూతో ఆమె ఈ పది రోజులూ బిజీనే. ఏప్రిల్ 5 న ఫ్యామిలీ స్టార్ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
అయితే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ మొదలుపెట్టబోయే ముందు మృణాల్ ఠాకూర్ స్పెషల్ గా పూజలు చేసింది. హైదరాబాద్ లోని పవర్ ఫుల్ అమ్మవారు బల్కంపేట్ ఎల్లమ్మ గుడిలో మృణాల్ ఠాకూర్ పూజలు నిర్వహించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మృణాల్ ఠాకూర్ బల్కంపేట్ ఎల్లమ్మ గుడిలో పూజలు చేసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ.. మీరు ఏదైనా పెద్ద పనిని ప్రారంభించే ముందు ఒక్క క్షణం ఆగి దేవుడిని ప్రార్థించండి, వీలైతే ఆలయాన్ని సందర్శించండి మరియు మీ మనస్సులో ఉన్న ప్రతిదాన్ని దేవుడి ముందు ఉంచండి.. అని నా తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతారు.
కాబట్టి నేను మరియు నా ఫ్యామిలీ స్టార్ టీమ్ ప్రమోషన్ల కోసం సన్నద్ధమవుతున్నప్పుడు దేవుడి ఆశీర్వాదం కోసం హైదరాబాద్‌లోని బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించాము.. అంటూ మృణాల్ ఠాకూర్ తానెందుకు పూజలు నిర్వహించిందో చెప్పుకొచ్చింది.