గత శుక్రవారం విడుదలైన సినిమాలకి లాంగ్ వీకెండ్ కలిసి వచ్చేలా హోలీ హాలిడే వచ్చింది. అసలైతే శనిఆదివారాల్లోనే చాలా సినిమాల పెరఫార్మెన్స్ తెలిసిపోతుంది. అదనంగా సోమవారం సెలవు వారికి కలిసొచ్చినట్టే. మరి గత శుక్రవారం మంచి అంచనాల నడుమ థియేటర్స్ లోకి వచ్చిన పలు సినిమాల్లో శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ కాస్త ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేసింది. ఆడియన్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి ఓం భీమ్ బుష్ కి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నట్టుగా కథని పక్కనబెట్టి హాయిగా నవ్వుకునేందుకు థియేటర్స్ కి వెళ్ళండి అంటూ పలువురు ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఓం భీమ్ బుష్ ని ప్రమోట్ చేసారు.
అయితే మొదటి రోజు IPL ఓపెనింగ్ దెబ్బకి ఓంభీమ్ బుష్ విలవిలలాడింది, రెండో రోజు కాస్త పుంజుకుంది. ఆదివారం కూడా ఓం భీమ్ బుష్ థియేటర్ ఆక్యుపెన్సీ బాగానే ఉన్నప్పటికీ.. సోమవారం సెలవు కూడా కలిసొస్తుంది, ఓం భీమ్ బుష్ కలెక్షన్స్ బావుంటాయని అందరూ అంచనా వేశారు. కానీ ఈరోజు సోమవారం హోలీ హాలిడే ని ఎవరూ ఓం భీమ్ బుష్ కోసం త్యాగం చెయ్యలేదు. అంటే థియేటర్స్ వైపు వెళ్లలేదు.
అందుకే ఓం బీమ్ బుష్ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కనిపించలేదు. బుక్ మై షోలో టికెట్స్ తెగడం లేదు. సోమవారం ఓం భీమ్ బుష్ కి చెప్పుకునే కలెక్షన్స్ రావడం కష్టమే. హోలీ సెలవని ఓం భీమ్ బుష్ మిక్స్డ్ రెస్పాన్స్ తో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు క్యాష్ చేసుకోలేకపోతున్నారు.