Advertisementt

రాజా సాబ్: మారుతి టెన్షన్ తీరినట్లేనా?

Sun 24th Mar 2024 11:06 AM
raja saab  రాజా సాబ్: మారుతి టెన్షన్ తీరినట్లేనా?
Raja Saab: Is Maruti tension over? రాజా సాబ్: మారుతి టెన్షన్ తీరినట్లేనా?
Advertisement
Ads by CJ

దర్శకుడు మారుతి తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ చేస్తున్నప్పుడు ఆయన అభిమానులు చాలా అంటే చాలా వ్యతిరేకిస్తూ మారుతిని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేసారు. ప్రభాస్ మారుతి తో మూవీ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. కానీ మారుతి మాత్రం ప్రభాస్ ఫాన్స్ ని ఫస్ట్ లుక్ తోలే కూల్ చేసాడు. రాజా సాబ్ గా ప్రభాస్ ని డిఫరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేసాడు. దెబ్బకి ప్రభాస్ ఫాన్స్ కూల్ అయ్యారు.

ఇకపోతే ప్రభాస్ వరస ప్రాజెక్ట్స్ తో మారుతి కి ఇప్పటివరకు రాజా సాబ్ కోసం బల్క్ డేట్స్ అయితే ఇవ్వలేదు. చిన్న చిన్న షెడ్యూల్స్ తప్ప మారుతి మూవీ షూట్లో ప్రభాస్ ప్రోపర్ గా పాల్గొన్నది లేదు. సలార్, కల్కి షూటింగ్స్ కంప్లీట్ చెయ్యడంతో మారుతికి అప్పుడప్పుడు డేట్స్ కేటాయిస్తూ వచ్చాడు ప్రభాస్. కానీ ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ కోసం ఎక్కువ సమయం కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ మొద‌టి వారం నుంచి రాజాసాబ్‌ సెట్లో మ‌రోసారి అడుగు పెట్ట‌బోతున్నాడు ప్ర‌భాస్‌.

ఈసారి ఓ పెద్ద షెడ్యూల్ ఫినిష్ చేసేంత వ‌ర‌కూ టీమ్ తోనే ఉంటాన‌ని దర్శకుడు మారుతికి ప్రభాస్ మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో సంజ‌య్‌ద‌త్ తో పాటుగా ముగ్గురు హీరోయిన్స్ అలాగే కీలక పాత్రలు చేసే నటులంతా పాల్గొంటారని సమాచారం. దానితో మారుతి టెన్షన్ ఫ్రీ అయ్యి యాక్టీవ్ ఆ భారీ షెడ్యూల్ కి సంబందించిన ఏర్పాట్లలో మునిగిపోయినట్లుగా టాక్. 

Raja Saab: Is Maruti tension over?:

Raja Saab shooting update

Tags:   RAJA SAAB
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ