యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో క్రేజీ ప్యాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న దేవర మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో గోవా పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. గోవా లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో దేవర పాట చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జోడిగా తంగం కేరెక్టర్ లో కనిపిస్తున్నట్టుగా మేకర్స్ ఎప్పుడో రివీల్ చేశారు. తంగంలో జాన్వీ కపూర్ లుక్ కూడా బయటికి వచ్చింది. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి భార్యగా కనిపించదట.
అందుకోసం మరో బ్యూటీని దేవర మేకర్స్ సెలెక్ట్ చేసేసారు. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో గుజరాతీ అమ్మాయి శృతి మరాఠే దేవర చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతుంది అనే ప్రచారం ఉండగా.. ఇప్పుడు అదే విషయాన్ని శృతి మరాఠే కన్ ఫర్మ్ చేసేసింది. అంతేకాదు శృతి మరాఠే దేవర హైదరాబాద్ షూటింగ్ లో కూడా పాల్గొందట. తాజాగా దేవర గురించి ఆమె మాట్లాడుతూ నేను దేవర లో నటిస్తున్న విషయం సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఈ చిత్రంలో నేను దేవర కి భార్య పాత్రలో కనిపిస్తాను.
దేవర అక్టోబర్ 10 న ప్యాన్ ఇండియాలోని పలు భాషల్లో విడుదలవుతుంది. ఈ చిత్రం విడుదల కోసం ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా నేను కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నాను అంటూ శృతి మరాఠే దేవర పై ఇచ్చిన అప్ డేట్ తో శృతి దేవర వైఫ్ అయితే జాన్వీ కపూర్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపిస్తుందా అంటూ మాట్లాడుకుంటున్నారు.