Advertisementt

ఉప్పెన రీమేక్: కృతి శెట్టి ప్లేస్ లో ఖుషి కపూర్

Fri 22nd Mar 2024 06:37 PM
kristhi shetty  ఉప్పెన రీమేక్: కృతి శెట్టి ప్లేస్ లో ఖుషి కపూర్
Uppena remake in bollywood with Khushi Kapoor ఉప్పెన రీమేక్: కృతి శెట్టి ప్లేస్ లో ఖుషి కపూర్
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో కొత్త దర్శకుడు బుచ్చి బాబు కొత్త హీరో-హీరోయిన్స్ వైష్ణవ్ తేజ్-కృతి శెట్టి లని పెట్టి ఉప్పెన అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కృతి శెట్టి అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. 17 ఏళ్లకే హీరోయిన్ గా మారి సీనియర్స్ నటీమణులల్లే హావభావాలతో ఆకట్టుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వరసగా యంగ్ హీరోలతో జోడి కట్టింది. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు వైష్ణవ తేజ్, బుచ్చి బాబు, కృతి శెట్టి అందరికి ఈ చిత్రంతో మంచి పేరుతో పాటుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఉప్పెన చిత్రం హిందీకి వెళ్లబోతుంది.

ఉప్పెన హిందీ రీమేక్ లో కృతి శెట్టి ప్లేస్ లో శ్రీదేవి కుమార్తె నటించనుంది అని తెలుస్తోంది. శ్రీదేవి పెద్ద కుమార్తే జాన్వి కపూర్ ఇప్పటికే హీరోయిన్ గా పలు ప్రాజెక్ట్స్ లో నటిస్తుండగా.. ఇప్పుడు ఆమె చిన్న కుమార్తె హీరోయిన్ గా తెరంగేట్రానికి రెడీ అయ్యింది. అందులో భాగం గానే ఖుషి కపూర్ ఉప్పెన రీమేక్ లో కృతిశెట్టి పాత్రలో చేయనున్నట్లుగా టాక్ మొదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నటుడు బోనీ కపూర్ నిర్మించనున్నట్టు ఆయన మాటల్లో అర్ధమవుతుంది. తాజాగా ఆయన RC16  ఓపెనింగ్ సందర్భంగా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన చిత్రం చూశాను. చాలా నచ్చింది. దీన్ని హిందీలో రీమేక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాం.. అని చెప్పడమే కాదు నా చిన్న కూతురు ఖుషీ కపూర్‌ను కూడా ఉప్పెన చూడమని చెప్పాను అన్నారు.

అంటే ఖుషి కపూర్ ఉప్పెన రీమేక్ లో నటింప చెయ్యాలనే ఆశ బోని కపూర్ లో ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. అలాగే హీరోగా ఏ బాలీవుడ్ హీరోని తీసుకుంటారో అనేది తెలియాల్సి ఉంది. 

Uppena remake in bollywood with Khushi Kapoor:

 Kristhi Shetty Uppena Movie will Remake in Bollywood with Kushi Kapoor

Tags:   KRISTHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ