శ్రీదేవి కి తిరుమల వెంకటేశ్వరునిపై ఎంత భక్తి ఉండేదో.. ఆమె కుమార్తె జాన్వీ కపూర్ కి కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడంటే అంతే భక్తి ఉంది. జాన్వీ కపూర్ తరచూ తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకుంటూ ఉంటుంది. ఫ్యామిలితోను, సింగిల్ గాను, బాయ్ ఫ్రెండ్ తోనూ ఇలా జాన్వీకపూర్ వేంకటేశ్వరుని దర్శనానికి వెళుతూ ఉంటుంది. తాజాగా మార్చ్ 6 న జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో అలాగే మరో ఫ్రెండ్ ఒరితో తో కలసి శ్రీవారి దర్శనం చేసుకుంది.
తాజాగా జాన్వీ కపూర్ తిరుపతి ట్రిప్ గురించి ఆమె ఫ్రెండ్ ఓరి సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. జాన్వీ కపూర్ ఇంటి నుంచి కారులో బయలుదేరి మూడు గంటల్లో తిరుపతి చేరుకున్నాము. ఆ తర్వాత జాన్వీ కపూర్ తన ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ ఎక్కే సమయంలో మోకాళ్ళ మెట్ల వద్ద జాన్వీ కపూర్, శిఖర్లు మోకాళ్ళ మీద మెట్లెక్కినట్టుగా చెప్పడంతో శ్రీదేవి, జాన్వీ అభిమానులంతా జాన్వీ కపూర్ కి ఎంత భక్తి అంటూ మాట్లాడుతున్నారు.
ఇక ఆ వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు. జాన్వీ కపూర్ దేవర షూటింగ్ సెట్స్ నుంచి రామ్ చరణ్ తో చేస్తున్న RC16 పూజా కార్యక్రమాల కోసం హైదరాబాద్ కి వచ్చింది. నిన్న ఆ కార్యక్రమం పూర్తి కావడంతో జాన్వీ తిరిగి దేవర షూటింగ్ కి వెళ్ళిపోయింది.