Advertisementt

ఒక్క నెల మూడు బ్లాక్ బస్టర్స్, ఇది రికార్డ్ అంటే..

Wed 20th Mar 2024 04:42 PM
maayalam movies  ఒక్క నెల మూడు బ్లాక్ బస్టర్స్, ఇది రికార్డ్ అంటే..
Three blockbusters in one month is a record ఒక్క నెల మూడు బ్లాక్ బస్టర్స్, ఇది రికార్డ్ అంటే..
Advertisement
Ads by CJ

ప్రతి నెలలో నాలుగు వారాలుంటాయి. ప్రతి వారం ఏవో సినిమాలు బాక్సాఫీసు దగ్గర సందడి చెయ్యడానికి వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని హిట్ అవ్వొచ్చు, మరికొన్ని ప్లాప్ అవ్వొచ్చు, లేదంటే ప్రతి వారం విడుదలైన అన్ని సినిమాలు హిట్ కొట్టినా కొట్టొచ్చు. అది విచిత్రం అనలేం కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్క నెలలో అది కూడా ఫిబ్రవరి లాంటి నెలలో మూడు బ్లాక్ బస్టర్స్ అంటే అది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. అదెక్కడో కాదు.. మలయాళ ఇండస్ట్రీలో. గత నెల ఫిబ్రవరిలో మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి అందరిని ఆశ్చర్యపరిచాయి.

ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన చిన్న చిత్రం ప్రేమలు కేవలం 3 కోట్లతో నిర్మించారు. ఫైనల్ రన్ లో ఆ సినిమా 125 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. మాలయంలో హిట్ అయిన ఈ చిత్రాన్ని కార్తికేయ తెలుగులో రిలీజ్ చెయ్యగా..  తెలుగులోను కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఫిబ్రవరి 15 న అక్కడ విడుదలైన భ్రమయుగం కూడా సూపర్ హిట్ అయ్యింది. 27 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, ఇప్పుడు 85 కోట్ల మార్కును దాటేసింది. ఒకే ఇంట్లో .. మూడే మూడు పాత్రలతో నడుస్తుంది. పైగా ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ లో తీశారు. 

ఇక ఫిబ్రవరి 22 న అదే మలయాళంలో మంజుమ్మెల్ బాయ్స్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైంది. యథార్థ సంఘటన ఆధారంగా నిర్మితమైన ఈ సినిమాని 20 కోట్లతో నిర్మింగా ఇప్పుడు ఏకంగా 200 కోట్ల మార్క్ ను దాటిపోవడం విశేషం. ఇలా అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన మూడు సినిమాలు .. భారీ వసూళ్లతో దూసుకుపోతుండటం నిజంగా విశేషమే!

Three blockbusters in one month is a record:

Four Blockbusters In Dry Period!

Tags:   MAAYALAM MOVIES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ