స్టార్ హీరో, సీనియర్ హీరో కూతురి వివాహమంటే ఎట్లుండాలా.. ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగు వేసి పెళ్లి చెయ్యాలే. మరి ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేసినా ఆ పెళ్ళిలో సెలెబ్రిటీస్ కనిపించకపోతే అది లోటే కదా.. సెలబ్రిటీస్ ఇంట్లో పెళ్లిళ్ళకి సినిమా ఇండస్ట్రీ నుంచి మిగతా ప్రముఖులు హాజరైతేనే ఆ పెళ్లిళ్లకి కళ వచ్చేది. అదే డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే అంత దూరం ప్రముఖులు వెళ్లకపోయినా ఇక్కడ హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కి అయినా హాజరవుతారు. అదే పెళ్లి హైదరాబాద్ లో జరిగితే ప్రముఖుల ఆహ్వానాలు మేరకు వధూవరులని ఆశీర్వదించడానికి వెళతారు.
కానీ వెంకటేష్ కుమార్తె హయవాహిని పెళ్ళిలో సెలబ్రిటీస్ కనిపించకపోవడం అభిమానులని నిరాశకి గురి చేసింది. వెంకటేష్ చిన్న కుమార్తె హయవాహినికి విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడు నిషాంత్ తో నిన్న శుక్రవారం వివాహం జరిగింది. రామానాయుడు స్టూడియోలో కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వైభవంగా ఈ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లికి సెలబ్రిటీస్ ఎవరూ హాజరు కాలేదా అనేది అందరిలో సందేహాలు.
దగ్గుబాటి ఇంట ఏ వేడుక జరిగినా అది చాలా ప్రవేట్ గా నిర్వహిస్తారు. గత ఏడాది అభిరామ్ వివాహం శ్రీలంకలో జరిపించి సైలెంట్ గా ఇండియాకి వచ్చేసారు. ఇప్పుడు వెంక కుమర్తె వివాహము అంతే. పెద్దమ్మాయి పెళ్లి వేడుకల్లోనూ సినీ సెలబ్రిటీస్ ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు చిన్న కుమ్మెర్త్ పెళ్లి హైదరాబాద్ లో జరిగినా వెంకీ ఎవరిని ఆహ్వానించినట్టుగా లేదు, మెహిందీ నైట్ లో నమ్రత, సితారలు కనిపించారు తప్ప మిగతా సెలబ్రిటీస్ సందడి లేదు. ఇప్పుడు పెళ్లిలోను ఎవరూ కనిపించడంపోవడంతో స్టార్ కుమార్తె పెళ్లి ఇంత సింపుల్ గానా అంటూ నెటిజెన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.