బుట్టబొమ్మ పూజ హెగ్డే కి బ్యాడ్ టైమ్ నుంచి గుడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందా.. అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ తర్వాత పూజ హెగ్డే కెరీర్ బాగా డౌన్ అయ్యింది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడో ఒకసారి మాత్రమే దర్శనమిస్తుంది. గుంటూ కారం సెట్స్ లోకి వచ్చాక మళ్ళీ వెంటనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత ఆమె సౌత్ మూవీస్ లో ఎక్కడా కనిపించలేదు. కానీ బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన ఓ మూవీకి సైన్ చేసింది. అది రేపో మాపో సెట్స్ మీదకి వెళ్లబోతుంది.
పూజ హెగ్డే ని తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టిన హరీష్ శంకర్ కూడా ఆమెని లైట్ తీసుకున్నాడనే టాక్ వినిపంచింది. ఈలోపులో పూజ హెగ్డే కి మరో బంపర్ ఆఫర్ తగిలింది అని తెలుస్తోంది. అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం, అలా వైకుంఠపురములో చిత్రాలు హిట్ తర్వాత మరోసారి అల్లు అర్జున్ తో ఆమెకి అవకాశం తగిలింది అని చెప్పుకుంటున్నారు. అది కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చెయ్యబోయే మూవీకి పూజ నే హీరోయిన్ అనుకుంటున్నారట.
కమర్షియల్ గా హీరోయిజంని పీక్స్ లో చూపించే అట్లీ హీరోయిన్స్ కి కూడా తగిన ప్రాధాన్యం కలిపిస్తాడు. మరి అల్లు అర్జున్-అట్లీ కాంబో ఎపుడు అనౌన్సమెంట్ వస్తుందో.. హీరోయిన్ గా పూజ హెగ్డే ఎప్పడు ఎంటర్ అవుతుందో చూడాలి.