సౌత్ బ్యూటీ రాశి ఖన్నా ప్రస్తుతం యోధా మూడ్ లో ఉంది. రేపు శుక్రవారం విడుదల కాబోతున్న ఆమె నటించిన హిందీ ఫిలిం యోధా పై రాశి ఖన్నా భారీ ఆశలే పెట్టుకుంది. ఈ చిత్రంతో భారీ హిట్ అందుకుని బాలీవుడ్ లో పాగా వేసే ప్లాన్ లో ఉంది. యోధా చిత్రంలో ఆమె లుక్స్ ఎలా ఉన్నాయో పూర్తిగా తెలియకపోయినా.. యోధా ప్రమోషన్స్ లో రాశి ఖన్నా గ్లామర్ షో పై బాలీవుడ్ ఇండియా బాగానే కథనాలు ప్రచారం చేసింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ రాశి ఖన్నా తరచూ ట్రెండ్ అవుతుంది.
యోధా చిత్ర ప్రమోషన్స్ మోడ్రెన్ అవుట్ ఫిట్స్ తో మెరిసిన రాశి ఖన్నా తాజాగా వదిలియా పిక్స్ అటు గ్లామర్ ని ఇటు ఆమె బాలీవుడ్ కలలని కనిపించేలా చేస్తున్నాయి. ఫార్జి వెబ్ సీరీస్ లో మాములుగా కనిపించిన రాశి ఖన్నా ఇప్పుడు యోధా లో మాత్రం వెయిట్ ఉన్న కేరెక్టర్ లో కనిపించబోతుంది. మరి ఈ చిత్రంపై రాశి పెట్టుకున్న కలలు నెరవేరుతాయో లేదో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. సిద్దార్థ్ మల్హోత్రా తో కలిసి రాశి ఖన్నా మార్చ్ 15 న యోధతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరి రాశి ఖన్నా కల నిజమవ్వాలని, యోధా తో ఆమె హిట్ కొట్టాలని కోరుకుందాం. ప్రస్తుతానికైతే ఆమె ఫ్రెష్ లుక్ ని చూసెయ్యండి.