సినిమా సెలబ్రిటీస్ కాఫీ తాగినా న్యూసే, వెకేషన్స్ కి వెళ్లినా న్యూసే, బాయ్ ఫ్రెండ్ తో తిరిగినా న్యూసే, ఆఖరికి సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తూ దిగిన పిక్స్ వదిలినా అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ అయితే కూర్చున్నా వార్తే, నించున్నా వార్తే. తాజాగా నటి పూజ హెగ్డే గోవాలో వెకేషన్ ని ఎంజాయ్ చెయ్యడమే కాదు.. ఆమె ఉదయపు సూర్య కిరణాలని ఎంజాయ్ చేస్తూ దిగిన పిక్స్ ని సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్స్టాలో షేర్ చేసింది.
పూజ హెగ్డే గోవాలో ఉదయపు ఎండని ఆస్వాదిస్తూ విటమిన్ D ని తీసుకుంటుంది. అంతేకాదు ఆమె దానితో పాటుగా తింటున్న టిఫిన్స్ పిక్స్ కూడాషేర్ చేసింది. ఈ వెకేషన్ లో పూజ హెగ్డే సింగిల్ గానే కనిపించింది. ఎప్పుడూ గ్లామర్ పిక్స్ ని షేర్ చేసే పూజా హెగ్డే ఇలా తీరిగ్గా గోవాలో రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ని షేర్ చెయ్యడంతో ఆమె అభిమానులు వాటిని తెగ వైరల్ చేస్తున్నారు.
ప్రస్తుతం పూజ హెగ్డే బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజి కాబోతుంది. ఆమె ఒప్పుకున్న హిందీ చిత్రాలు అతి త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్నాయని తెలుస్తోంది.