మలయాళంలో బ్లాక్ అండ్ వైట్ లో స్టార్ హీరో మమ్ముట్టి నటించిన భ్రమయుగం మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. మూడే మూడు పాత్రలతో రెండున్నర గంటల పాటు బ్లాక్ అండ్ వైట్ లో సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేసారు అంటే మాములు విషయం కాదు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన భ్రమయుగం చిత్రాన్ని తెలుగులో ఫిబ్రవరి 23 న డబ్బింగ్ చేసి విడుదల చేసారు. తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినప్పటికీ.. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు అంతగా అంతగా ఆదరించలేదు.
ఇక ఈ చిత్రం ఏ ఓటిటిలో వస్తుంది, అలాగే ఎప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది అని ఫ్యామిలీ ఆడియన్స్ గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. మమ్ముట్టి సూపర్ హిట్ ఫిల్మ్ భ్రమయుగం చిత్రాన్ని సోని లివ్ ఓటిటి రైట్స్ దక్కించుకుంది. అయితే సోని లివ్ నుంచి భ్రమయుగం చిత్రం మార్చ్ 15 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన ఇచ్చారు.
అయితే ఈ చిత్రం సోని లివ్ నుంచి మలయాళ భాషలో మాత్రమే అందుబాటులోకి రానుందా లేదంటే భ్రమయుగం డబ్బింగ్ అయిన అన్ని భాషల్లోనూ సోని లివ్ నుంచి ఓటిటి ప్రేక్షకులకి అందుబాటులోకి రానుందా అనేది తెలియాల్సి ఉంది.