Advertisementt

దేవర గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది

Wed 06th Mar 2024 12:27 PM
janhvi kapoor  దేవర గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది
Janhvi Kapoor a happy and joyous birthday! దేవర గర్ల్ ఫ్రెండ్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

దేవర గర్ల్ ఫ్రెండ్ కొత్త లుక్ తో వచ్చేసింది. అదేనండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జోడీ కడుతున్న జాన్వీ కపూర్ దేవర లుక్ మరోసారి రివీల్ చేసారు మేకర్స్. గత ఏడాది ఇదే రోజు మార్చ్ 6 న జాన్వీ కపూర్ ని దేవర చిత్రంలోకి ఆహ్వానిస్తూ ఆమె దేవర లో చెయ్యబోయే పాత్ర తంగం తాలూకు లుక్ ని వదిలిన మేకర్.. మళ్ళీ ఈ ఏడాది మరోసారి జాన్వీ కపూర్ కి బర్త్ డే విషెస్ ని అందజేస్తూ దేవరలో జాన్వీ కపూర్ పాత్ర కి సంబంధించి మరో లుక్ ని వదిలారు.

మరి గత లుక్ లో జాన్వీ కపూర్ తంగం గా అచ్చం జాలర్ల అమ్మాయిలా కనిపించగా.. ఈసారి పక్కా ట్రెడిషనల్ గా పల్లెటూరి అమ్మాయి లుక్ లో కనిపించింది. లూజ్ హెయిర్, పెద్ద బొట్టు, చెవులకి జుంకాలు, మెడలో నెక్ లెస్ లో చీర కట్టులో జాన్వీ కపూర్ ఎంతో తన్మయత్వంతో దేవర కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉందా లుక్. అది చూసిన ఎన్టీఆర్ అభిమానులు దేవర గర్ల్ ఫ్రెండ్ వచ్చేసిందిరో అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఎప్పుడు గ్లామర్ గా కనబడే జాన్వీ కపూర్ దేవర లో విలేజ్ గర్ల్ గా కనిపించబోతుంది. ఇదే కాదు జాన్వీ కపూర్ మరో సౌత్ బిగ్గెస్ట్ ఫిల్మ్ RC16 నుంచి కూడా ఆమెకి అద్భుతమైన రీతిలో బర్త్ డే శుభాకాంక్షలు అందాయి. 

Janhvi Kapoor a happy and joyous birthday!:

Devara team Wishing our beloved Thangam, Janhvi Kapoor a happy and joyous birthday!

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ