Advertisementt

బాలీవుడ్ నీళ్లు బాగా వంటబట్టాయి

Fri 01st Mar 2024 10:21 AM
raashi khanna  బాలీవుడ్ నీళ్లు బాగా వంటబట్టాయి
Raashi Khanna latest glamour stills బాలీవుడ్ నీళ్లు బాగా వంటబట్టాయి
Advertisement
Ads by CJ

సౌత్ హీరోయిన్స్ హిందీలో కాదు కాదు ముంబైలో కాలు పెట్టగానే బాలీవుడ్ నీళ్లు వంటబట్టేస్తాయి. సౌత్ లో గ్లామర్ చూపించేందుకు హద్దులు గీసుకుని ఉండేవారు నార్త్ కి వెళ్ళగానే అందాలు చూపిస్తారు. గతంలో సమంత, కాజల్, తమన్నా లాంటి వారు అదే చేసారు. ఇప్పుడు రష్మిక సౌత్ లో ఎంతోకొంత పద్దతిగా కనిపించేది. కాని హిందీలోకి వెళ్లిందో లేదో.. అక్కడి హీరోయిన్స్ కి పోటీగా అందాలు ఆరబోస్తుంది. ఇప్పుడు రాశి ఖన్నా. ఆమె సౌత్ లోను గ్లామర్ కేరెక్టర్లుతోనే హైలెట్ అయ్యింది.

ఎంతగా గ్లామర్ చూపించినా ఇక్కడ హిట్టే అవ్వలేదు. ఇప్పుడు ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతోంది. అది కూడా టూ గ్లామర్ షో చేస్తూ. ఫార్జి వెబ్ సీరీస్ తో ముంబై కి ఎంటర్ అయిన ఈభామ ఆ తర్వాత అక్కడే సెటిల్ అయ్యే ఏర్పాట్లలో ఉంది. సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి యోధా చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి సినిమాలో ఎలా ఉన్నా.. ప్రమోషన్స్ తో రాశి ఖన్నా తన గ్లామర్ మొత్తం చూపించేపనిలో ఉంది.

తాజాగా యోధా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాశి ఖన్నా రెడ్ కలర్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో కనిపించింది. ఆ డ్రెస్ లో అందాలు అలవోకగా ఆరబోసింది. అది చూసిన ప్రతి ఒక్కరూ అమ్మడుకి బాలీవుడ్ నీళ్లు బాగా వంటబట్టాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Raashi Khanna latest glamour stills:

Raashi Khanna at Yodha trailer launch

Tags:   RAASHI KHANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ