నిన్న బుధవారం సోషల్ మీడియా ఓపెన్ చెయ్యగానే.. నటి తాప్సి పెళ్లి వార్త స్పెషల్ గా హైలెట్ అయ్యింది. హీరోయిన్ రకుల్ పెళ్లి చేసేసుకుంది.. ఇకపై తాప్సి కూడా తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. డెన్మార్క్ బ్యాట్మెంటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సి ఏడడుగులు నడిచేందుకు సిద్ధమైంది. తాప్సి పెళ్లి మార్చి నెల చివరి వారంలో.. అందరు సెలెబ్రిటీస్ లాగే తాప్సి కూడా ఉదయ్ పూర్ కోటలోనే అంగంరంగ వైభవంగా వివాహం చేసుకోబోతుంది.
తాప్సి తన ప్రేమని కొన్నాళ్లు బయటపెట్టకుండా సీక్రెట్ ని మైంటైన్ చేసినట్టుగానే పెళ్లి విషయాన్ని కూడా సీక్రెట్ గా ఉంచాలనుకుంటుంది అంటూ రకరకాల వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
మరి పెళ్లి వార్తలు ఆ రేంజ్ లో వైరల్ అవడంతో అది చూసిన తాప్సి ఓ రేంజ్ లో ఫైరయ్యింది. తన పెళ్లి విషయంలో జరుగుతున్న అసత్య ప్రచారంపై ఆగ్రహంతో ఊగిపోయింది. నా పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఎప్పుడు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇకనుంచి కూడా ఫ్యూచర్ లో నా వ్యక్తిగత విషయాలపై ఎలాంటి స్పష్టత ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పింది. దీనితో తాప్సి తన పెళ్లి పై వస్తున్న రూమర్స్ ని ఇలా తెగ్గొట్టేసింది.