Advertisementt

కేసీఆర్‌తో పోలిస్తే.. చంద్రబాబు ఎంతో బెస్ట్ ?

Mon 26th Feb 2024 02:53 PM
chandrababu  కేసీఆర్‌తో పోలిస్తే.. చంద్రబాబు ఎంతో బెస్ట్ ?
Compared to KCR.. is Chandrababu the best? కేసీఆర్‌తో పోలిస్తే.. చంద్రబాబు ఎంతో బెస్ట్ ?
Advertisement
Ads by CJ

కేసీఆర్‌తో పోలిస్తే.. సీట్ల విషయంలోనూ చంద్రబాబే ది బెస్ట్ ?

టీడీపీ అధినేత చంద్రబాబును ఓడించాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయనడంలో సందేహమే లేదు. ఈసారి తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ శతవిధాలుగా యత్నిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారందరికీ చంద్రబాబే బాస్ అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు వలంటీర్లను తన ప్రైవేట్ సైన్యంగా తయారు చేస్తున్నారు. వారికి రాజకీయ శిక్షణ ఇప్పిస్తున్నారు. తమతో కలిసి పని చేసేందుకు గానూ డబ్బులిచ్చి మరీ రంగంలోకి దింపుతున్నారు. ఇలాంటి పరిస్థితులను సైతం ఎదుర్కొని మరీ చంద్రబాబు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో మరోసారి ఏపీ, తెలంగాణ రాజకీయాలను నెటిజన్లు కలిపి చూస్తున్నారు.

నెక్ట్స్ లిస్ట్‌లో సైతం పేరుండే అవకాశమే లేదు..

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూడోసారి కూడా అధికారం తనదేనన్న ధీమాతో ఉండేవారు. ఇక గజ్వేల్ అయితే తన ఇలాఖా అని.. అక్కడ తనను ఓడించేంత సీన్ ఎవరికీ లేదని బీభత్సమైన కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అలాంటి కేసీఆర్‌కు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఎక్కడో తేడా కొడుతున్నట్టు అనిపించింది. అంతే గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ నామినేషన్ వేశారు. కానీ చంద్రబాబు అలా చేయలేదు. కేవలం కుప్పం అభ్యర్థిగా మాత్రమే తనను తాను ప్రకటించుకున్నారు. నెక్ట్స్ లిస్ట్‌లో సైతం ఆయన పేరు ఉండే అవకాశమే లేదని టాక్. నిజానికి కుప్పంలో చంద్రబాబును ఓడించాలని జగన్ పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు.

ఒక్కచోటు నుంచే పోటీ..

ప్రస్తుతం పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో కంటే కుప్పంలోనే ఎక్కువగా ఉంటున్నారు. పైగా సీఎం జగన్ చొక్కా మడతపెట్టండంటూ వైసీపీ శ్రేణులతో పాటు వలంటీర్లను రెచ్చగొడుతున్నారు. అలాగే చంద్రబాబు పని అయిపోయిందని.. అందుకే అక్కడి నుంచి ఆయన సతీమణిని రంగంలోకి దింపుతున్నారంటూ సైతం వైసీపీ ప్రచారం చేస్తోంది. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రే ఓ సభలో ఈ మాటలు చెప్పారు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లోనూ చంద్రబాబు కుప్పం ఒక్కచోటు నుంచే పోటీ చేస్తున్నారు తప్ప మరో స్థానంపై ఆలోచనే చేయడం లేదు. చంద్రబాబు ఆత్మవిశ్వాసానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని టీడీపీ కేడర్ ప్రశ్నిస్తోంది. కేసీఆర్‌తో పోలిస్తే ఈ విషయంలోనూ చంద్రబాబే ది బెస్ట్ అంటోంది.

Compared to KCR.. is Chandrababu the best?:

Chandrababu better than KCR

Tags:   CHANDRABABU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ