Advertisementt

కల్కి కథ పై దర్శకుడు కామెంట్స్ వైరల్

Mon 26th Feb 2024 12:21 PM
nag ashwin  కల్కి కథ పై దర్శకుడు కామెంట్స్ వైరల్
Nag Ashwin reveals Prabhas-starrer Kalki 2898 AD story కల్కి కథ పై దర్శకుడు కామెంట్స్ వైరల్
Advertisement
Ads by CJ

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కుస్తున్న ప్యాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD చిత్రంపై ట్రేడ్ లో విపరీతమైన బజ్ ఉంది. మే 9 టార్గెట్ గా తెరకెక్కుతున్న కల్కి 2898 AD చిత్రానికి సంబందించిన ఏ చిన్న అప్ డేట్ ని అయినా ప్రభాస్ ఫాన్స్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. హిందూ పురాణాల్లో చెప్పబడిన విష్ణుమూర్తి దశావతారం కల్కి ప్రధాన పాత్రగా ఈ మూవీ రూపొందుతుందనే టాక్ ఉంది. అయితే తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2898 AD కథ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారాయి.  

కల్కి కథ ఎలా మొదలవుతుంది.. ఎలా పూర్తి అవుతుంది.. అనేది నాగ్ అశ్విన్ ఓ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చాడు. కల్కి మూవీ మహాభారతం కథ నుండి మొదలవుతుందని.. అక్కడ మొదలైన స్టోరీ.. 2898వ సంవత్సరంలో పూర్తి అవుతుందట. ఈమధ్యలో ఏం జరిగింది అనేది కల్కి సీక్వెల్స్ ద్వారా ఆడియన్స్ కి చూపించబోతున్నారట. కలియుగం చివర్లో చెడును అంతం చేయడానికి వస్తానని చెప్పిన మహావిష్ణువు.. 10వ అవతారమైన కల్కి కథ ఆధారంగా సినిమా తెరకెక్కిందనే భారీ బజ్ ఉండనే ఉంది. ఇప్పుడు నాగ్ అశ్విన్ చెప్పిన అది కథకి సింక్ అవడంతో ఈ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Nag Ashwin reveals Prabhas-starrer Kalki 2898 AD story:

Nag Ashwin shares update on Kalki 2898 AD

Tags:   NAG ASHWIN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ