Advertisementt

మెగాస్టార్ విశ్వంభరపై ఇంట్రెస్టింగ్ న్యూస్

Mon 26th Feb 2024 11:11 AM
chiranjeevi  మెగాస్టార్ విశ్వంభరపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Interesting news on Megastar Vishwambhara మెగాస్టార్ విశ్వంభరపై ఇంట్రెస్టింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ రిజల్ట్ తర్వాత బాగా అలోచించి బింబిసార దర్శకుడు వసిష్ఠకి ఓకె చెప్పారు. వసిష్ఠ మెగాస్టార్ చిరుకి మెచ్చే స్క్రిప్ట్ తో విశ్వంభరని లైన్ లోకి తీసుకొచ్చి పట్టాలెక్కించేసాడు. త్రిష హీరోయిన్ గా విశ్వంభర సెట్స్ లోకి అడుగుపెట్టింది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న విశ్వంభర ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్ గా మారిపోయింది. అయితే ఈ చిత్రంలోకి మరో ఇద్దరు హీరోయిన్స్ జాయిన్  అయినట్లుగా తెలుస్తోంది. వాళ్లే సురభి ఇంకా ఇషా చావ్లా. వీరిద్దరి కేరెక్టర్స్ కి కూడా సరిపడా ప్రాధాన్యత ఉంటుంది అంటున్నారు. 

ప్రస్తుతం నల్గొండ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న విశ్వంభరపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. ఈ ఫ్లాష్ బ్యాక్ లో విజువల్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని, అంతేకాకుండా ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ముందు నుంచి చెబుతున్నట్టుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామాగా వసిష్ఠ విశ్వంభర ని తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం.

Interesting news on Megastar Vishwambhara:

Interesting Details About Chiranjeevi Vishwambhara

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ