తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం సంక్రాంతి ఫెస్టివల్ కి విడుదలై సెన్సేషనల్ విజయం సాధించింది. ప్యాన్ ఇండియా లోని పలు భాషల్లో విడుదలైన హనుమాన్ కి అన్ని భాషల నుంచి అద్భుతమైన సక్సెస్ దక్కింది. ఈ చిత్రం థియేటర్స్ లో అతి పెద్ద హిట్ అవడంతో హనుమాన్ ని ఓటిటిలో మరోసారి వీక్షించేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. హనుమాన్ ఇప్పటికీ థియేటర్స్ లో అక్కడక్కడా సందడి చేస్తూనే ఉంది.
అందుకే మేకర్స్ కూడా హనుమాన్ ఓటిటి డేట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. సంక్రాంతి కి విడుదలైన సినిమాలన్ని ఓటిటీలలో సందడి చేస్తున్నాయి. హనుమాన్ కూడా మార్చ్ 2 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందనే న్యూస్ ఎప్పటినుంచో వినిపిస్తోన్నా.. దానిపై మేకర్స్ స్పష్టతనివ్వడం లేదు. ఏకకాలంలో పాన్ ఇండియా భాషల్లో అయితే జీ 5 లో అందుబాటులో ఉంటుంది అని.. ఈ మార్చ్ 2 నుంచే ఓటిటి ఆడియన్స్ ముందుకు వస్తుంది అని కూడా స్ట్రాంగ్ బజ్ ఉంది. చూద్దాం మేకర్స్ అధికారికంగా ఎపుడు డేట్ లాక్ చేస్తారో అనేది.