RX100 హిట్ తర్వాత మళ్ళీ అంతటి హిట్ ని పాయల్ రాజ్ ఫుట్ కి అదే అజయ్ భూపతి మంగళవారంతో అందించాడు. మంగళవారం సినిమా కన్నా ముందే పాయల్ రాజ్ ఫుట్ చాలా సినిమాలు చేసింది. కానీ ఏమి వర్కౌట్ అవ్వలేదు. మంగళవారం సినిమాలో డీ గ్లామర్ గా నెగెటివ్ లుక్ లో కనిపించినా ఆ సినిమా బాగా వర్కౌట్ అయ్యింది. అటు థియేటర్స్ లో ఇటు ఓటిటీ ఇంకా నిన్నగాక మొన్న బుల్లితెర మీద కూడా మంగళవారం పెద్ద హిట్ అయ్యింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే పాయల్ రాజ్ ఫుట్ తాజాగా తన తల్లికి ఓ ఆపరేషన్ జరిగినట్టుగా చెప్పి ఎమోషనల్ అయ్యింది. తన తల్లి ఎప్పటి నుంచో మోకాలి నెప్పితో బాధపడుతుంది అని, అందుకే ఆమెకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించినట్టుగా చెప్పుకొచ్చింది. ఆ ఆపరేషన్ ఎంతో పెయిన్ తో కూడుకున్నది అని, ఆపరేషన్ చేసాక నెప్పితో ఆమె బాధపడింది అని, ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది అంటూ తన తల్లి కోలుకుంటున్న వీడియో తో పాటుగా ఆమె ఇప్పుడిప్పుడే నడుస్తున్న వీడియో ని షేర్ చేసింది పాయల్.