నాగ చైతన్య-సమంత నాలుగేళ్ళ పెళ్లి బంధానికి విడాకులతో ముగింపు పలికాక ఇద్దరూ ఎవరి జీవితంలో వారు బిజీ అయ్యారు. విడాకుల తర్వాత సమంత నటన, హెల్త్ రీజన్స్, విహార యాత్రలు అంటూ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటే.. నాగ చైతన్య మాత్రం కెరీర్ పై దృష్టి సారించాడు. ఇక వీరిద్దరిపై ఎలాంటి న్యూస్ వినిపించినా అది క్షణాల్లోనే వైరల్ గా మారుతుంది. నాగ చైతన్య విడాకుల తర్వాత గుంభనంగా ఉంటే సమంత మాత్రం సోషల్ మీడియా వేదికగా ఏదో విషయంగా స్పందిస్తూనే ఉంది.
అయితే సమంత.. నాగ చైతన్య హీరోయిన్ సాయి పల్లవిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ లో కలిసి నటించారు. మళ్ళీ ఇప్పుడు తండేల్ చిత్రంలో కలిసి కనిపించబోతున్నారు. తాజాగా సమంత సాయి పల్లవి మంచి డాన్సర్ అన్న విషయం తనకి తెలుసు అని, ఆమె డాన్స్ చేసిన ఓ షో కి తాను జెడ్జ్ గా ఉన్నాను అని, అప్పుడు డాన్స్ ప్రోగ్రాం లో సాయి పల్లవి వేస్తున్న డాన్స్ స్టెప్పులకి అలాగే కళ్లప్పగించి చూస్తూ ఉండిపోయాను, అంత అద్భుతంగా ఆమె డాన్స్ చేసింది అంటూ సాయి పల్లవి డాన్స్ ని సమంత పొగిడేసింది.
ప్రస్తుతం సాయి పల్లవి పై సమంత చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. సాయి పల్లవి నాగ చైతన్యతో తండేల్ షూటింగ్ లో బిజీగా వుంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె లుక్స్ అందరిని ఇంప్రెస్స్ చేసాయి.