అలియా భట్ సౌత్ ఆఫర్స్ జాన్వీ కపూర్ తన్నుకుపోతుందా.. అంటే ఇప్పుడు జాన్వీ కపూర్ సౌత్ ఆఫర్స్ జోరు చూస్తుంటే నిజమే అనుకునేలా ఉంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఇమ్మిడియట్ గా అలియా భట్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం చేద్దామనుకున్నాడు. హీరోయిన్ గా అలియా భట్ పేరు కూడా దర్శకుడు కొరటాల అనౌన్స్ చేసారు. కానీ అలియా భట్ ప్రెగ్నెంట్ అవడంతో ఆ అవకాశం జాన్వీ కపూర్ చెంతకి చేరింది. దేవరతో జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ ఖాయమైంది. మరి ఇది అలియా భట్ ఆఫరే కదా..
ఇప్పడు రామ్ చరణ్ మరోసారి అలియా భట్ తో జోడి కట్టే అవకాశం ఉంది అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రామ్ చరణ్ RC16 లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది. అసలు బుచ్చిబాబు అలియా భట్ ని అనుకున్నాడా? అసలు సంప్రదించడం అనేది పక్కనపెడితే.. రామ్ చరణ్ తో అలియా భట్ మరోసారి జోడి కడుతుంది అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. కానీ ఇప్పుడు అదే ప్లేస్ లోకి అఫీషియల్ గా జాన్వీ కపూర్ వచ్చేసింది. మరి ఈ ఆఫర్ అలియాది అయినా, కాకపోయినా.. ఆమెని ఊహించుకున్న మెగా అభిమానులకి ఇప్పుడు జాన్వీ కపూర్ ని చూడాల్సి వస్తుంది.
బాలీవుడ్ లో అలియా భట్ నుంచి పోటీ ఎదుర్కోలేకపోయినా.. జాన్వీ కపూర్ సౌత్ లో మాత్రం అలియా భట్ చెయ్యాల్సిన ప్రాజెక్ట్స్ లోకి వచ్చేసి అలియా కి బాగానే చెక్ పెట్టింది అని జాన్వీ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.